విజయవాడ

బీపీఎస్ నిబంధనలు తప్పకుండా అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 27: అనధికార భవన నిర్మాణాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న భవనాలకు బీపీఎస్ నిబంధనలను తూచా తప్పకుండా అమలుచేయాల ని, భవన ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించిన తరువాతే బిల్డింగ్ ప్లాన్‌ను రెగ్యులైజ్ చేయాలని వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. ఈమేరకు గురువారం ఉదయం బీపీఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను కమిషనర్ ప్రసన్న వెంకటేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించిన మీదట అధికారులకు పలు సచూనలు చేశా రు. ఇందులో భాగంగా గవర్నర్‌పేట, సూర్యారావు పేటలోని కమర్షియల్ భవనాన్ని పరిశీలించిన ఆయన భవనానికి సంబంధించిన ప్లాన్‌లో పొందుపర్చిన దానికి విరుద్ధంగా నిర్మాణాలు ఉండటాన్ని గమనించిన ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్లాన్ నిబంధనాల ప్రకారమే బీపీఎస్ అనుమతులివ్వాలని సూచించారు. అదేవిధంగా బందర్‌రోడ్డులో లైఫ్ స్టైల్ భవనానికి సంబంధించి యజమాని రూ.46లక్షలను చెల్లించాల్సి ఉందని, ఈనెలాఖరుతో ముగియనున్న బీపీఎస్ ప్లాన్ ప్రకారమే ఉన్న భవనాలను రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించారు. వివిధ ప్రదేశాల్లో ప్లాన్‌లకు విరుద్ధంగా చేపట్టిన అనధికార నిర్మాణాలపై వచ్చిన ఫి ర్యాదులకు సంబంధించి భవనాలను కేవలం స్లామ్‌కు రంద్రాలు మాత్రమే కాకుండా పూర్తిస్థాయిలో తొలగించాలని, అదేవిధంగా ఈ తొలగింపునకు అయిన ఖర్చును కూడా భవన యజమానికి జరిమామా విధించి వసూలు చేయాలన్నారు. సిటీ ప్లానర్ లక్ష్మణరావు, డెప్యూటీ సిటీ ప్లా నర్ సూరజ్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలాజీ పలువురు బిల్డింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

జిల్లా అభివృద్ధికి మంత్రి పెద్దిరెడ్డి కృషి
*కలెక్టర్ ఇంతియాజ్, పలువురు ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 27: జిల్లా సమగ్ర అభివృద్ధికి సహకరిస్తున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కలెక్టర్ ఇంతియాజ్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు గురువారం నగరంలో జరిగిన డీఆర్‌సీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించిన కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లా కు ప్రత్యేకంగా ఉపాధి హామీ కింద రూ.100కోట్లను మంజూరు చేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే కే పీ సారథి మాట్లాడుతూ 6సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై క్షేత్రస్థాయిలో సమస్యలపై అవగాహన కలిగిన పెద్దిరెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉండటం అదృష్టమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీరు, రహదారుల నిర్మాణానికి తాము కోరిన దాని కన్నా ఎక్కువ నిధులు కే టాయిస్తున్న వైనం హర్షణీయమన్నా రు. సీఎం జగన్ అమలుచేస్తున్న కా ర్యక్రమాలతో ప్రజాప్రతినిధులకు ఎం తో విలువ పెరిగిందన్నారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, జోగి ర మేష్, మల్లాది విష్ణు, రక్షణ నిధి, దూ లం నాగేశ్వరరావు, కైలా అనీల్‌కుమా ర్ తమ నియోజకవర్గాల అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రి పెద్దిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 4,53, 064 మంది పెన్షనర్లు ఉండగా, వీరిలో కొత్తగా 64వేల మందికి మంజూరైన ట్టు తెలిపారు. గతంలో వివిధ కారణాలతో పెన్షన్లలో నిలిచిన 43వేల 408 మందికి రీ వెరిఫికేషన్‌కు అందాయని, వాటిని సమగ్రంగా పరిశీలించిన తరువాత వారు తీసుకువచ్చిన ఆధారాల మేరకు 31,496 మం దిని అర్హులుగా గుర్తించి పెన్షన్ అందజేయడం జరిగిందన్నారు.