విజయవాడ

మున్సిపల్ కార్మికుల సమస్యలపై ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (గాంధీనగర్) ఫిబ్రవరి 27: మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లోని ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. గురువారం జరిగిన ఈకార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 233 జీవో ప్రకారం మెడికల్ హెల్త్ అలవెన్స్ రూ.6వేలను 2019 ఆగష్టు నుండి తక్షణమే చెల్లించాలని, స్కానింగ్ మిషన్ చేసే కార్మికులకు అదనంగా నలుగురు కార్మికులను నియమించాలని కోరారు. పార్కులలో పనిచేస్తున్న డ్వాక్వా సీఎంఈవై గ్రూపుల కార్మికులకు పాత ఏరియర్స్ బకాయిలు వర్తింపజేయాలన్నారు. డ్రైనేజీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనంగా రూ.21వేలు ఇవ్వాలని, కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులకు హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఉద్యోగ, కార్మికులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. వెంటనే ఈసమస్యలు పరిష్కరించకపోతే మార్చి 18న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్ బాబూరావు పాల్గొని ప్రసంగించారు. సీఐటీయూ నాయకులు ఎం డేవిడ్, జ్యోతిబాసు, రాంబాబు, తిరుపతమ్మ, మార్తమ్మ, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెపుతారు
విజయవాడ (గాంధీనగర్) ఫిబ్రవరి 27: ఉద్యమం చేస్తున్న జేఎసీ సభ్యులను పోలీసులు భయపెట్టి కేసులు పెడితే ఉద్యమం ఆగిపోతుందనుకుంటున్నారని, అదంతా భ్రమేనని, ఎట్టి పరిస్థితులలోనూ ఉద్యమం ఆగదని అమరావతి పరిరక్షణా సమతి జిల్లా జేఏసీ కన్వీనర్ జే స్వామి అన్నారు. గాంధీనగర్‌లోని ధర్నా చౌక్‌లో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. గురువారం జరిగిన ఈధర్నాలో స్వామి మాట్లాడుతూ రాజధాని కోసం 72 రోజులుగా ఆందోళన చేస్తున్న మహిళలను, రైతులను ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. రానున్న కాలంలో ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెపుతారన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మూడు రాజధానుల విషయాన్ని వెనక్కు తీసుకోవాలని సూచించారు.