విజయవాడ

సీఎం నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 24: ఎంతో విశ్వాసంతో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దుర్గగుడి ట్రస్ట్ బోర్డును నియమించారని, వాళ్లు కూడా అదేస్థాయిలో పనిచేసి సీఎంకు మంచి పేరు తీసుకువచ్చినప్పుడే ట్రస్ట్ బోర్డు సీఎంకు కృతజ్ఞతలు తెలిపినట్లని రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం సా యంత్రం దుర్గమ్మ సన్నిధిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈకార్యక్రమానికి విచ్చేసిన మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ దుర్గగుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా ఎన్నికైన పైలాసోమినాయుడు, ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేసిన 15మంది సభ్యులను తొలుత అభినందించారు. ఈసందర్భంగా మంత్రి వె లంపల్లి మాట్లాడుతూ దుర్గగుడి ప్రతిష్ఠను పెంచి, భక్తులకు అవసరమైన మరిన్ని వౌలిక సదుపాయాల కల్పనతోపాటు, ఆదాయాన్ని కూడా పెంచాల్సిన కీలకమైన బాధ్యత ట్రస్ట్ బోర్డుపై ఉందన్నారు. బాబు ఏర్పాటు చేసిన ట్ర స్ట్ బోర్డు సభ్యులు అమ్మవారి చీరలను సైతం పట్టుకుపోయి ఆలయ ప్రతిష్ఠతను దెబ్బతీశారనాన్నరు. అప్పటి ట్రస్ట్‌బోర్డుకు దీటుగా వైఎస్ జగన్ వేసిన ట్రస్ట్‌బోర్డు పనిచేయాలన్నారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్ ఇచ్చిన వాగ్దానం మేరకు ట్రస్ట్‌బోర్డులో మహిళలకు సముచిత స్థానం కేటాయించటంతోపాటు అన్ని వర్గాలకు సముచితస్థా నం ఇచ్చారన్నారు. సీఎం నమ్మకాన్ని వ మ్ము చేయకుండా ప్రభుత్వానికి మం చిపేరు తీసుకువచ్చేలా ట్రస్ట్ బోర్డు పనిచేయాలన్నారు. దేవస్థానం చైర్మన్‌గా పైలా సోమినాయుడు, 15మంది ధర్మకర్తలుగా సాయంత్రం అమ్మవారి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈవో ఎంవీ సురేష్‌బాబు తొలుత 16మంది సభ్యుల చేత ధర్మకర్తలుగా ప్రమాణం చేయంచారు. ఒక మహిళా ధర్మకర్త చై ర్మన్‌గా పైలా సోమినాయుడు పేరును ప్రతిపాదించగా మిగతా సభ్యులంద రూ ఏకగ్రీవంగా ఆమోదించటంతో ఈ వో ఎంవీ సురేష్‌బాబు పైలా సోమినాయుడు చైర్మన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. ధర్మకర్తలుగా కే శ్రీదేవి, డీవీఆర్‌కే ప్రసాద్, బీ సుబ్బాయమ్మ, పీ చంద్రకళ, ఓవీ రమణ, జీ ప్రసాదరావు, ఆర్ శివప్రసాద్‌రెడ్డి (ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసన సభ్యుడు), సీవీ వరలక్ష్మీ, కే రాజ్యలక్ష్మీ, ఎన్ సుజాత, ఎన్ అంబిక, కే వెంకట రమణ, ఎన్ సతీష్, బీ జ్యోతి, లింగంబొట్ల దుర్గా ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. శాసన సభ్యుడు కే పార్థసారధి, ఎం గిరిధర్, వసంత కృష్ణ ప్రసాద్, డీ నాగేశ్వరరావు, వైకాపా అర్బన్ అధ్యక్షుడు బీ భువకుమార్, దేవినేని అవినాష్, సహాయ ఈవోలు రమేష్, చంద్రశేఖర్, సుధారాణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్, స్థానాచార్యుడు విష్ణు బొట్ల శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, మిగత సభ్యులకు మంత్రులు, శాసన సభ్యులు అభినందనలు తెలిపారు. దేవస్థానానికి తొలిసారిగా 1972లో సర్దార్ మరుపిళ్ల చిట్టి సతీసమణి మరుపిళ్ల భ్రమరాంబను చైర్మెన్‌గా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నియమించి పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నగరాల కులస్థులకు అరుదైన గౌరవం ఇచ్చింది. సుమారు 39ఏళ్ల తర్వాత బీసీ వర్గానికి చెందిన నగరాల కులానికి చెందిన పైలా సోమినాయుడుని దుర్గగుడి ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా జగన్ నియమించారు.