విజయవాడ

కిడ్నీ కొనుగోలు పేరుతో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 24: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో సోమవారం నిర్వహించిన స్పందనకు మొత్తం 164 ఫిర్యాదులు అందాయి. కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 149 ఫిర్యాదులు రాగా, కమిషనరేట్ పరిధిలోని జోన్లు, సర్కిల్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో జరిగిన స్పందనకు 15 ఫిర్యాదులు వచ్చాయి. కమిషనర్ తన కార్యాలయంలో జరిగి న స్పందన ద్వారా బాధితులతో నేరు గా మాట్లాడి వారి స్వయంగా పిటిషన్లు స్వీకరించారు. అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా పోలీస్ స్టేష న్లు, సర్కిళ్లు, జోన్లు కార్యాలయాల్లో నిర్వహించిన స్పందనకు వచ్చిన పిటిషన్లపై ఆరా తీశారు. సమస్యల పరిష్కారానికి వారంలోగా తగిన చర్యలు చేపట్టాలని ఆయా అధికారులను సీపీ ఆదేశించారు. ఇదిలా ఉండగా ఆర్థిక బాధలతో సతమతమవుతున్న ఓ మహిళ ఆన్‌లైన్‌లో కిడ్నీ అమ్మకానికి పెట్టే ప్రయత్నంలో మోసపోయి డబ్బు వదిలించుకున్న ఉదంతం స్పందన ద్వారా పరిష్కారమైంది. దీంతో బాధితురాలి కుటుంబం పోలీసు కమిషనర్‌ను సోమవారం కలిసి కృతఙ్ఞతలు తె లియచేసింది. రామరాజ్యనగర్‌కు చెం దిన కన్నా శివనాగ ఊర్వశి తనకు ఆర్థిక బాధలు ఎక్కువగా ఉండటం వల్ల ఉ ద్యోగ అవకాశాల కోసం గూగుల్ సెర్చ్ వెతుకుతుండగా, కిడ్నీ అమ్మదలిచినవా రు ఈ అడ్రస్‌ను సంప్రదించండి అని డాక్టర్ పౌల్ గాబ్రియేలు, అపోలో మె డికల్ సెంటర్, అన్న నగర్ చెన్నై అనే ప్రకటన చూసి అందులోని ఫోన్ నెం బర్‌కు ఫోన్ చేసింది. దీంతో రూ.25 లక్షలు ఇస్తామని, రాను పోను ఫ్లైట్ టికెట్స్ కూడా పంపుతామని కాకపోతే ది నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ నందు రిజిస్టర్ చేసుకోవాలని అందుకు రూ.10వే లు తమ అకౌంట్‌కు పంపమని చెప్పా రు. వారి మాటలు నమ్మిన సదరు మ హిళ సదరు అకౌంట్‌కు రూ.10వేలు జమ చేసింది. అది మొదలు ట్రాన్స్‌ఫర్ ఛార్జీలు, ఇన్ కం ట్యాక్స్ క్లియరెన్స్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ అంటూ వివిధ పేర్లతో రూ.1,20,000 వరకు డబ్బులు కట్టించుకున్నారు. ఇంకా డబ్బులు చె ల్లించమని కోరగా, అప్పటికే అప్పులు ఎక్కువై బాధ పడుతున్న బాధితురాలి కి అనుమానం వచ్చి జనవరి 6న స్పం దన ద్వారా పోలీసు కమిషనర్‌ను కలి సి ఫిర్యాదు చేసింది. సీపీ ఆదేశాలతో ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైం పోలీసులు, భవానీపురం పోలీస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేయించి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు జమ చేసిన డ బ్బు ఏఏ అకౌంట్లలో జమ చేయబడ్డా యో పరిశీలించి సంబంధిత బ్యాంకు లు, ఈ-వాలేట్ సంస్థలతో సంప్రదింపు లు జరిపి రూ.90వేల రూపాయలు బాధితురాలికి తిరిగి ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈ మోసానికి పాల్పడిన నిందితుల అరెస్టు నిమిత్తం దర్యాప్తు వేగవంతం చేశారు. తమకు న్యాయం జరిగినందుకు కన్నా శివ నా గ ఊర్శవి కుటుంబ సమేతంగా సైబర్ క్రైం సీఐ కే శివాజీతో కలిసి పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావును కలిసి కృతఙ్ఞతలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీలు అమ్మడం, కొనడం వంటి కార్యకలాపాలు చట్టరీత్యానేరమని పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు అన్నారు. కిడ్నీ దానం చేయాలంటే ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయని, ప్రభుత్వం అజమాయిషీలోనే జరగాల్సి ఉంటుందని అన్నారు. కిడ్నీ అమ్మదలచడం, కొనడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. లాటరీ, ఉద్యోగ ప్రకటన ద్వారా గాని మరేదైనా మార్గంలో గాని లాభం ఆశ చూపి ఎదురు డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తుల బారిన పడి మోసపోరాదని సూచించారు. ఈరకమైన సంప్రదింపుల్లో అకౌంటు నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ పంపించి, డబ్బులు వేయమనే వారి పట్ల జాగ్రత్తలు పాటించాలని, మేసేజ్‌ల ద్వారా పంపించే ఏ లింకులనూ తెరవరాదని, వాటి ద్వారా స్క్రీన్ షేరింగ్ అప్లికేషన్‌లను ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసి పైకం కాజేస్తారని, బార్ కోడ్, క్యూ ఆర్ కోడ్‌లను కూడా స్కాన్ చేయరాదని సీపీ సూచించారు.