విజయవాడ

వైకాపా నిరంకుశ పాలనకు చరమగీతం పలకాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, ఫిబ్రవరి 19: సీఎం జగన్ నిరంకుశ పాలనకు చరమగీతం పలకాలని, వైకాపా ప్రభుత్వ పాలన చూసి ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వైకాపా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చంద్రబాబు చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు సంఘీభావంగా బుధవారం ఉదయం పటమట 11వ డివిజన్‌లో గద్దె రామ్మోహన్ ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఇవ్వండమ్మా, అక్క, అవ్వా, తాతా అంటూ తన పదవీ కాంక్షతో ప్రజా సంకల్పయాత్ర చేపట్టిన జగన్ అసాంతం అలవికాని హామీలు ఇచ్చి, అందలం ఎక్కిన జగన్ అనంతరం అడ్డగోలు నిర్ణయాలతో పేదలు, వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, తదితరుల పొట్ట కొడుతున్నాడని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికే ప్రజా చైతన్య యాత్రలు చేపట్టి ప్రజలకు వివరించటం జరుగుతుందన్నారు. జగన్ తీసుకుంటున్న ఒంటెద్దు నిర్ణయాలతో రాష్ట్ర దివాలా తీసే పరిస్థితి వస్తుందన్నారు. 8నెలల కాలంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టకుండా రాష్ట్ర ప్రజల్ని హింసిస్తున్నాడని ఆరోపించారు. మాజీ మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ వైకాపా పాలన వలన రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న, జరగబోయే నష్టాల గురించి ప్రజల్ని చైతన్య పరచటానికి ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చైతన్య యాత్ర ప్రారంభానికి ముందు అంబేద్కర్, జ్యోతిరావ్ పూలే, ఎన్టీఆర్, జగజ్జీవన్‌రామ్, తదితర నాయకులు చిత్రపటాలకు పూల మాలలు వేశారు. అనంతరం వైకాపా నవమాసాల పాలన.. నవ మోసాల పాలనపై.. ముద్రించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తుమాటి ప్రేమ్‌నాథ్, చెన్నుపాటి గాంధీ, పేరేపి ఈశ్వర్, రత్నం రమేష్, దాసరి మల్లేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.