విజయవాడ

డిస్నీలాండ్ 97ఎకరాల స్థలాన్ని పేదలకివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, ఫిబ్రవరి 19: శ్రీరామ్ ఎనర్జీ, డిస్నీలాండ్ కింద ఉన్న 97 ఎకరాల భూమిని నగరంలో ఇళ్లు లేని పేదలకు పంపిణీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు చిగురుపాటి బాబూరావు డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో స్థానిక వాంబే కాలనీలోని డిస్నీలాండ్ స్థలాన్ని ఆపార్టీ బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లిస్తామని, గ్రామ వలంటీర్లతో దరఖాస్తులు పెట్టిస్తున్నారని, ఆ దరఖాస్తులో రాజధాని ప్రాంతమైన తుళ్లూరు దాని పరిసర ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తున్నట్లు దరఖాస్తులు పూర్తి చేయిస్తున్నట్లు తెలిపారు. రాజధాని ప్రాంతంలోని స్థలాలు కోర్టులో ఉంటే ఏలా పేదలకు ఇస్తారని ప్రశ్నించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అద్దెదారులందరికీ ఇళ్లు ఇస్తామని ఒక్కొక్కరి దగ్గర నుండి రూ.25వేల నుండి రూ.75వేల వరకు కట్టించుకుని జక్కంపూడిలో ఇళ్ల నెంబర్లతో సహా ఇచ్చారని, వారిలో ఏ ఒక్కరికీ ఇల్లు ఇవ్వలేదన్నారు. నిజంగా వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాంబే కాలనీలోని డిస్నీలాండ్ స్థలం, ఎక్సెల్ ఫ్యాక్టరీ స్థలం, శ్రీరామ్ ఎనర్జీ స్థలాల్ని పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. నగరానికి 30కిలోమీటర్ల దూరంలో స్థలాలు ఇస్తే అక్కడకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బీ రమణారావు, కే దుర్గారావు, చింతల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా చెన్నుపాటి పురస్కారాల ప్రదానం
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 19: మన పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని, ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలను సాధించి సామాజిక విద్యాభ్యున్నతికి కృషి చేయాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. యూటీఎఫ్ నగర శాఖ ఆధ్వర్యంలో నగరంలోని మాంటిస్సోరి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో గత సంవత్సరం 2019లో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించిన ఉపాధ్యాయులను, నూరుశాతం ఫలితాలు సాధించిన టీచర్లు, ప్రాథమిక పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ పెంచిన హెచ్‌ఎంలతోపాటు సీనియర్ ఎస్‌జీటీ టీచర్లు, రిటైర్డ్ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ మారుతున్న ప్రభుత్వ విధానాలకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల పనితీరును కూడా మెరుగుపర్చాలన్న ఆయన ప్రతి ఒక్కరికీ మెరుగైన విద్యనందించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యతన్నారు.