విజయవాడ

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (గాంధీనగర్) ఫిబ్రవరి 17: రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై అఖిల పక్షం వేయాలని, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కే రామకృష్ణ, పీ మధు అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో స్థానిక లెనిన్ సెంటర్‌లో సోమవారం ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా సీపీఏం రాష్ట్ర కార్యదర్శి పీ మధు మాట్లాడతూ రాష్ట్రం తీవ్ర ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటోందని, రాజధాని తరలింపు, మండలి రద్దు అనేవి సరైన నిర్ణయం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయకపోగా కొత్త సమస్యలు సృష్టిస్తోందన్నారు. రాజధాని తరలింపు, మండలి రద్దుకు కేంద్రం హామీ ఇచ్చి రాష్ట్రంలోని సమస్యలకు కారణమవుతోందన్నారు. రాజధాని తరలింపు, మండలి రద్దుకు వీల్లేదని కేంద్రం ఒక్కమాట చెప్పగలిగితే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు వచ్చేవి కావన్నారు. రాష్ట్రంలో బీజేపీ రాజధాని తరలింపునకు వ్యతిరేకం అంటే, కేంద్రంలో పరోక్షంగా మద్దతు ఇస్తోందని, నాటకం మొత్తం కేంద్రం దగ్గర ఉందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ మాట్లాడుతూ విభజన బిల్లులో పొందుపర్చిన ఏ ఒక్క హోదా అంశాన్నీ కేంద్రం అమలు చేయలేదన్నారు. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం ఫోర్టు గురించి మాట్లాడటం లేదని, ప్రత్యేక హోదా ఊసే ఎత్తడం లేదని వాపొయారు. ఢిల్లీ వెళ్లి మోదీని కలిసిన జగన్ రెండు కుంటుంబాల విషయంలాగా అక్కడేం జరిగిందో బయట పెట్టడం లేదన్నారు. ఆరు బడ్జెట్‌లలో కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. ప్రభుత్వం దిగేవరకు పోరాటం సాగిస్తామని తెలిపారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ఏపీకి జరుగుతున్న అన్యాయానికి మోదీతో పాటు జగన్, చంద్రబాబు కూడా కారణమన్నారు. ఏపీ అంథకార బంధనంలో ఉందని, రాష్ట్ర దౌర్భాగ్య స్థితిని చూస్తే గుండెలు అవిసిపోతున్నాయన్నారు. ఈపరిస్థితులలో రాష్ట్ర ప్రజలందరూ సమష్టిగా ఉండాలని సూచించారు. ఈకార్యక్రమంలో సీహెచ్ బాబురావు, డీవీ కృష్ణా, దోనేపూడి శంకర్, నాగోతు ప్రసాద్, జీ కోటేశ్వరరావు, పల్లా దుర్గారావు, భూపతి రమణ, దుర్గారావు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.