విజయవాడ

ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 17: ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు అందించేందుకు విజయవాడ డివిజన్‌లో లే అవుట్ పనులు చురుగ్గా సాగుతున్నాయని సబ్ కలెక్టర్ హెచ్‌ఎం ధ్యానచంద్ర కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్‌కు తెలిపారు. సోమవారం రెవెన్యూ అధికారులతో కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సబ్ కలెక్టర్ తన కార్యాలయం నుంచి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఇళ్ల స్థలాల కోసం గుర్తించిన భూముల్లో లే అవుట్ పనులు, ప్లాట్లు విభజన ఇతర వౌలిక సదుపాయాల పనులను ఈనెలాఖరులోగా పూర్తి చేసేందుకు ముందుకు వెళున్నట్లు చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల్లో స్పందనలో వివిధ సేవల కోసం అందుతున్న దరఖాస్తులను తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో పరిపాలనాధికారి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ తహసీల్దారు హేమకుమారి, తదితరులు పాల్గొన్నారు.
సబ్ కలెక్టర్ ‘స్పందన’కు 375 అర్జీలు
సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందనకు 375 అర్జీలు వచ్చాయి. వివిధ సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రజల నుంచి వచ్చిన పిటిషన్లను సబ్ కలెక్టర్ హెచ్‌ఎం ధ్యానచంద్ర స్వీకరించి తగిన చర్యలకు అధికారులను ఆదేశించారు. వీటిలో అర్బన్ హౌసింగ్ కోసం 160, రూరల్ హౌసింగ్ కోసం 120, రేషన్‌కార్డుల కోసం 15, మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి 40, పోలీసుశాఖకు సంబంధించి 5, తహసీల్దార్ల పరిధిలో పరిష్కారం కోసం 20, ఇతర సమస్యల పరిష్కారం కోసం 15 దరఖాస్తులు అందాయి. పలువురు రేషన్ కార్డులు, పెన్షన్, ఇళ్ల స్థలాలు కోసం వినతి పత్రాలు అందచేశారు. పెనమలూరు మండలానికి చెందిన మాల మహానాడు నాయకులు దాసరి రంగనాథ్ అధికారులకు వినతి పత్రం ఇస్తూ కామయ్య తోపు సెంటర్ అంబేద్కర్ భవనంలో ఉన్న దళిత కమ్యూనిటీ హాల్ గ్రంథాలయాన్ని యథాతథంగా ఉంచాలని కోరారు, దీన్ని వేరే కార్యాలయానికి వినియోగిస్తారనే వస్తున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వినతి పత్రాన్ని సమర్పించారు. స్పందనలో వివిధ శాఖ అధికారులను, సిబ్బంది పాల్గొని ప్రజల అర్జీలు స్వీకరించి సందేశాలు నివృత్తి చేశారు.