విజయవాడ

స్థానిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 17: త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నగర ప్రజల ను మోసం చేసే పనిలో వైఎస్‌ఆర్‌సీపీ పాలకులు ఉన్నారని పలువురు టీడీపీ నేతలు, మాజీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు సోమవారం నగరంలోని అర్బన్ టీడీపీ కార్యాల యం కేశినేని భవన్‌లో నిర్వహించిన స మావేశంలో మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, మాజీ కార్పొరేటర్లు ఉ మ్మడి చంటి, కే హనుమంతరావు మా ట్లాడుతూ నగరంలో 80వేల మందిని ఇళ్లకు అర్హులుగా చేశామంటూ స్వయా న మున్సిపల్ కమిషనర్ ప్రకటించగా, ఈ 80వేల మందికి రాజధాని అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూముల లో స్థలాలు ఇస్తామనడం, కృష్ణాజిల్లా వాసులను అమరావతికి తరలించే ప్ర యత్నం చేస్తున్నారని, దీనికి వార్డు వ లంటీర్లను వినియోగించుకుంటూ పేదలను మభ్య పెడుతున్న తీరు హేయమన్నారు. 9నెలలుగా పేదల నడ్డి విరిచిన వైకాపా ప్రభుత్వం అన్న క్యాంటీన్లు, మరణించిన వారికి చంద్రన్న బీమా, పెళ్లికానుక, డ్వాక్రా రుణమాఫీ, శానిటేషన్ కార్మికులకు రూ.18వేల జీతం, రేషన్‌కార్డులు తొలగించడం, వృద్ధాప్య పెన్షన్లు, అమ్మ ఒడి పథకాలను వివిధ కారణాలతో అనర్హులుగా ప్రకటించిన వైనం శోచనీయమన్నారు. గత చంద్రబాబు నాయుడు పాలనలో నిర్మించిన పలు పక్కాగృహాలను పూర్తి చేసి ఏ ఒ క్కరికైనా పంపిణీ చేయలేని పాలకులు ఒకేసారి 80వేల మందికి ఇళ్ల స్థలాలిస్తామంటూ ప్రకటనలు చేయడం ఎన్నికల ప్రయోజనం కోసమేనని తెలిపారు. అ మరావతిలో రైతులకు ఈ భూములను మీకే ఇస్తామంటూ ఒక పక్క ప్రకటిస్తున్న వైనం గమనార్హం కాగా, అమరావతి రక్షితం కాదని, వరదల తాకిడి ఎ క్కువగా ఉండే చోట రాజధాని నిర్మా ణం క్షేమం కాదని అన్న పాలకులు ఇ ప్పుడు 3లక్షల మందిని అక్కడికి తరలించాలని చూడటాన్ని పరిశీలిస్తే వారి ని ఏ వరదల్లో కొట్టుకుపోమని అర్థమాని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టే పనిలో లబ్ధిదారులకు ఇస్తున్న అంగీకారపత్రంలో ఒక్క బ్లాక్ నెంబర్ కానీ, ప్లాట్ నెంబర్ కానీ హద్దులు కానీ లేకుండా 48గజాలు ఇస్తామనడం చెప్పడం మోసం చేయడమేనని, నగర ప్రజలు చైతన్యవంతులన్న విషయాన్ని గుర్తించి పాలకుల మోసాలను గ్రహించి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. నగర పాలక సంస్థలో వైకాపా అధికారంలోకి వస్తే మున్సిపల్ ఆస్తులను దేవాదాయ భూముల మాదిరిగా అమ్మేస్తారని ఆరోపించారు. ఈ సమావేశంలో నేతలు లింగమనేని శివరామప్రసాద్, సుకాశి కిరణ్‌కుమార్, బీ శ్రీనివాస్, కే శ్రీనివాస్, మరుపిళ్ల తిరుమలేష్, పత్తి నాగేశ్వరరావు, హరనాథస్వామి, తదితరులు పాల్గొన్నారు.