విజయవాడ

కళాపోషకులను ప్రోత్సహిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (గాంధీనగర్) ఫిబ్రవరి 16: మానసిక ఒత్తిడిని తొలగించగల శక్తి సంగీత, సాహిత్య కార్యక్రమాలకు మాత్రమే ఉంటుందని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగు కళావాహిని, శ్రీ కళాభారతి, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, దిట్లకవి కళాపరిషత్ సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కళాకారులకు ఉపాధి కల్పించి, ఆదరిస్తున్న ప్రతి ఒక్కరూ సమాజ సేవకులేనన్నారు. శ్రీ కళాభారతి అధ్యక్షుడు సింగంశెట్టి పెద్దబ్రహ్మంను శాసనసభ్యులు మల్లాది విష్ణుతో కలసి వివిధ కళా సంస్థల పక్షాన సత్కరించారు. ప ద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ మధ్యతరగతి జీవనం సాగిసు తన్న కళాకారులకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. గాత్ర సంగీత, వా యిద్య కళాకారులకు నిర్వాహకులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమం లో భాగంగా నిర్వహించిన సంగీత వి భావరిలో పాత చలన చిత్రాలలోని గీ తాలను గాయనీ, గాయకులు శ్రా వ్యంగా ఆలపించారు. చింతకాయల చిట్టిబాబు పర్యవేక్షణలో జరిగిన ఈకార్యక్రమంలో కే సుబ్బరాజు, తటవర్తి సూర్యనారాయణ, డీ శంకరరావు, కళా సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా దివ్య ఖురాన్ కంఠస్థ పోటీలు
* విజేతలకు బహుమతుల ప్రదానం
పటమట, ఫిబ్రవరి 16: జవహర్ ఆటోనగర్ ఆటోమొబైల్ టెక్నిషియన్స్ అసోసియేషన్ హాల్‌లో ఆదివారం ఉద యం యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఖురానిక్ స్టడీస్ ఆధ్వర్యంలో 16వ రాష్టస్థ్రాయి బాలల దివ్య ఖురాన్ కంఠస్థ ప్రతిభా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి సుమారు 2వేల మంది ముస్లిం తల్లిదండ్రులు తమ పిల్లలను పోటీలకు తీసుకొచ్చి ప్రోత్సహించారు. బాల బాలికలు దివ్య ఖురాన్ కంఠస్థ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీలో బాలలు ఏకధాటిగా ఖురాన్‌ను పఠించడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెద్దలను మంత్రముగ్ధుల్ని చేశారు. పోటీల్లో పాల్గొన్న చిన్నారుల్లో 44 మంది బాలబాలికలను ప్రతిభ ఆధారంగా నిర్వాహకులు ఫైనల్స్‌కు ఎంపిక చేశారు. ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్ గ్రూపులుగా విభజించి విజేతలైన బాలబాలికలతో పాటు పాల్గొన్న ప్రతి చిన్నారికీ ప్రతిభ ఆధారంగా సర్ట్ఫికెట్, జ్ఞాపిక అందజేశారు. ప్రథమ బహుమతి సాధించిన గ్రూప్‌కు రూ. 20వేలు, ద్వితీయ బహుమతి సాధించిన గ్రూప్‌కు రూ. 15వేలు, తృతీయ బహుమతి సాధించిన గ్రూప్‌కు రూ. 10వేలు నగదు బహుమతి, సర్ట్ఫికెట్, జ్ఞాపిక అందజేశారు. ఈసందర్భంగా యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఖురానిక్ స్టడీస్ చైర్మన్ మహ్మద్ దావూద్ మాట్లాడుతూ సమాజంలో అశాంతి, అలజడి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచ శాంతి కోసం ఖురాన్ పఠన ప్రతిభా పోటీలు నిర్వహించామని తెలిపారు. సామాజిక రుగ్మతలు, సమస్యలన్నింటికీ మూలకారణమైన అవినీతి, అనైక్యతను రూపుమాపేందుకు ఈ పోటీలు దోహదపడతాయన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారిలో జాతీయ భావం పెంపొందించటానికి ఖురాన్ పఠన ప్రతిభా పోటీలు ఎంతోగానో ఉపయోగపడతాయని ఆయన వివరించారు. కార్యక్రమంలో స్టేట్ కన్వీనర్ అమీన్ హుమిరీ, సిటీ కన్వీనర్ బాజానీ, వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ సిద్ధిక్, సెక్రటరీ హబీబ్ ఖాన్, ఎండీ బాబు, హంజా, ముసేబు, హుస్సేన్, మసూద్ పాల్గొన్నారు.