విజయవాడ

నగర గోడలకు ఆర్కిటెక్ట్ విద్యార్థుల పెయింటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 25: నగరంలోని పలుచోట్ల అపరిశుభ్రంగా ఉన్న గోడలకు స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్ట్ విద్యార్థులు అందమైన పెయింటింగ్‌లు వేసి సుందరంగా తీర్చిదిద్దారు. వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సూచనల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం సుమారు 10మంది విద్యార్థులు అసిస్టెంట్ సిటీప్లానర్ అజయ్ పర్యవేక్షణలో గోపాల్‌రెడ్డి రోడ్డులోని రైల్వే క్వార్టర్స్ గోడలకు పెయింటింగ్ వేశారు. ఈసందర్భంగా ఏసీపీ అజయ్ మాట్లాడుతూ గతంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రధాన రహదారుల్లో వివిధ కళాశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల వారిచే గోడలకు పెయింటింగ్‌లు వేయించామని గుర్తుచేశారు. అదేరీతిలో ఆర్కిటెక్చర్ కాలేజ్ విద్యార్థులు, వివిధ కళాశాల విద్యార్థులచే వీఎంసీ ఆధ్వర్యాన అందమైన పెయింటింగ్‌లు వేయిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్, పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర అంశాలపై పలు సందేశాత్మక అంశాలతో కూడిన చిత్రాలు వేసేలా చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు.

కొత్త ట్రాఫిక్ సామగ్రి పంపిణీ
చేసిన సీపీ ద్వారకాతిరుమలరావు, దుర్గగుడి ఈవో సురేష్‌బాబు
విజయవాడ (క్రైం), జనవరి 25: ట్రాఫిక్ సమస్యల నియంత్రణకు రోడ్డు భద్రతా సామగ్రిని పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ట్రాఫిక్ అధికారులకు అందచేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, దసరా, భవానీ దీక్షలు, శివరాత్రి, వీఐపీల బందోబస్తు సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు పోలీసు కమిషనర్ సహకారంతో దుర్గగుడి ఈవో సురేష్‌బాబు కొంత బడ్జెట్‌ను కేటాయించగా ట్రాఫిక్ డీసీపీ టీ నాగరాజు ఆధ్వర్యాన రోడ్డు కొత్త సేఫ్టీ ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేయడం జరిగింది. కోన్స్-500, రేడియం జాకెట్స్-120, హ్యాండ్ గ్లోవ్స్-100, స్టాండ్ బారికేడ్స్-50, హేవీ బారికెడ్స్-35, వార్నింగ్ లైట్స్-25, ఫోల్డింగ్ కోన్స్-22 తదితర సామగ్రి కొనుగోలు చేశారు. కమిషనర్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దుర్గగుడి ఈవో సురేష్‌బాబు, పోలీసు కమిషనర్ చేతుల మీదుగా ట్రాఫిక్ అధికారులకు సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీసు కమిషనర్ బీ శ్రీనివాసులు, క్రైం డీసీపీ కోటేశ్వరరావు, సీఎస్‌డబ్ల్యూ డీసీపీ ఉదయరాణి, ట్రాఫిక్ డీసీపీ టీ నాగరాజు, ట్రాఫిక్ ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్డు సచివాలయం ప్రారంభం
విజయవాడ (గాంధీనగర్) జనవరి 25: ప్రజల ముంగిటికే ప్రభుత్వ సేవలను అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిందని సెంట్రల్ శాసనసభ్యుడు మల్లాది విష్ణు అన్నారు. సూర్యారావుపేటలోని కర్నాటి రామమోహనరావు నగరపాలక సంస్థ పాఠశాలలో ఏర్పాటు చేసిన 91, 92, 93 వార్డు సచివాలయాలను శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్బంగా విష్ణు మాట్లాడుతూ పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగానే సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టారన్నారు. గతంలో రేషన్ కార్డు, ఫింఛన్, తదితర ధ్రువీకరణ పత్రాలను పొందాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదన్నారు. నేడు ఆ పరిస్థితికి స్వస్తిచెప్పామని, దరఖాస్తు చేసిన 72గంటలలో సమస్యను పరిష్కరించేలా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.