విజయవాడ

ప్రహసనంగా డివిజన్ల విభజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 19: నగరంలోని 59 డివిజన్లను 64 డివిజన్లుగా విభజన చేసిన తీరు అశాస్ర్తియమని, అధికార వైసీపీకి అనుకూలంగా అధికారులు వ్యవహరించిన తీరుతోనే విభజన చేసిన డివిజన్లలో ఏ ఒక్కటీ సరైన రీతిలో లేదని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు, సీనియర్ కార్పొరేటర్లు అభిప్రాయపడ్డారు. వీఎంసీ అధికారులు ఇటీవల చేపట్టిన డివిజన్ల విభజనపై ఆదివారం నగరంలోని కేశినేని భవన్‌లో పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని అధ్యక్షతన సమావేశమైన నేతలు విభజన తీరుపై మండిపడ్డారు. ఆదివారం సమావేశమైన నేతలు సోమవారం కూడా మరోసారి సమావేశమై చర్చించనున్నారు. అధికారులు చేపట్టిన విభజన తీరుపై పరిశీలించేందుకు టీడీపీ తరఫున ప్రత్యేక కమిటీ వేసి అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకురావడమే కాకుండా అవసరమైతే న్యాయ పోరాటం చేసేందుకు సైతం వెనుకాడేది లేదని సమావేశంలో తీర్మానించారు. ఈసందర్భంగా పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని మాట్లాడుతూ డివిజన్లను ఏ ప్రాతిపదికన విభజన చేశారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వార్డు వలంటీర్లతో కులం పేరుతో గణన చేయించిన తీరు హేయమన్న ఆయన నగరాభివృద్ధికి ఈ విభజన తీవ్ర అవరోధమన్నారు. అధికారులు వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మాజీ మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ అశాస్ర్తియంగా జరిపిన డివిజన్ల విభజనపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలని, విభజన చేసిన డివిజన్ల ఓటరు జాబితాను బహిర్గతం చేయాలన్నారు. డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు మాట్లాడుతూ నగర డివిజన్లను గతంలో రెండు సార్లు విభజన చేయగా, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఉత్పన్నం కాలేదని, గతంలో జరిపిన మాదిరిగానే ఇప్పుడు విభజన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఐదు డివిజన్లు పెంచామని చెబుతున్న అధికారులు ఓటర్ల, జనాభా అంశాలలో ఏ ప్రాతిపదికన చేశారో కూడా అయోమయ గందరగోళంగా చేశారన్నారు. 8వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ 16-18 వేల ఓటర్లు, జనాభా పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఎంత విస్తీర్ణంలో చేశారన్న విషయంపై చెప్పాలన్నారు. ప్రస్తుతం జరిపిన విభజన తీరుపై వైసీపీ హస్తమున్న విషయం స్పష్టమవుతోందన్నారు. మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ చేస్తున్న అరాచక పాలనకు నగర డివిజన్ల విభజన పరాకాష్టగా నిలుస్తుందని, అస్తవ్యస్త విభజనతో తెలుగుదేశం పార్టీ విజయవకాశాలను దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలన్న వైసీపీ పాలకుల ఆలోచనల కనుగుణంగా విభజన చేశారని ఆరోపించారు. 13వ డివిజన్ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, 47వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జీ మహేష్, తదితరులు మాట్లాడుతూ అప్రజాస్వామికంగా జరిపిన డివిజన్ల విభజనపై ప్రజల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉందని, దీనిపై ప్రజల పక్షాన నిలబడి నగరాభివృద్ధికి అనుకూలంగా విభజన జరిగేలా అవసరమైతే న్యాయపోరాటానికైనా సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.