విజయవాడ

మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (గాంధీనగర్) జనవరి 19: మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నేతలు నగరంలోని బీఆర్‌టీఎస్ రోడ్డు, తదితర ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శాసనసభ్యులు జోగి రమేష్, పార్థసారథి, మల్లాది విష్ణు, సామినేని ఉదయభానుతోపాటు పలువురు వైసీపీ నేతలు దేవినేని అవినాష్, యార్లగడ్డ వెంకట్రావు, గౌతంరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతికి ఎలాంటి అన్యాయం జరగదన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చే సంస్కృతి చంద్రబాబుకే ఉందని విమర్శించారు. ప్రజలంతా పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్నారన్నారు. రెచ్చగొట్టాలన్న చంద్రబాబు ప్రయత్నాలు ప్రజలు నమ్మడం లేదన్నారు. చలో అసెంబ్లీలో పాల్గొనేందుకు ప్రజలు సిద్ధంగా లేరని, ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని తెలిపారు. రైతులను చంద్రబాబు ఏ విధంగా మోసం చేస్తున్నారో ప్రజలు త్వరలో తెలుసుకుంటారన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్‌తో చంద్రబాబు అండ్ గ్యాంగ్ భూములను కొట్టేశారని ఆరోపించారు. శాసనసభ్యులు, వైసీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని ఏద్దేవా చేశారు. 5ఏళ్ల కాలంలో దుర్గగుడి వద్ద వంతెనను నిర్మించలేకపోయారన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధే తమ ధ్యేయమని వ్యాఖ్యానించారు. బాబు ట్రాప్‌లో పడవద్దని హితువు పలికారు. లెజిస్లేటివ్ క్యాపిటల్ విజయవాడలోనే ఉందని గుర్తుచేశారు. నగర సమగ్రాభివృద్ధే ముఖ్యమంత్రి ధ్యేయమన్నారు. సుజనా చౌదరి వంటి వారి మాటలను నమ్మవద్దన్నారు.
ర్యాలీకి తరలి వెళ్లిన వైకాపా నేతలు
ఇంద్రకీలాద్రి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంఘీభావంగా ఆదివారం పాతబస్తీలోని వివిధ సెంటర్‌ల నుండి వైకాపా నేతల ఆధ్వర్యంలో కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్ నుండి వైకాపా 34వ డివిజన్ అధ్యక్షుడు పైడిపాటి మురళీ, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడిపాటి రమేష్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది కార్యకర్తలు, బ్రాహ్మణ వీధి రామాలయం సెంటర్ నుండి 25వ డివిజన్ వైకాపా అధ్యక్షుడు గుర్రం సుబ్బయ్య ఆధ్వర్యంలో 500మంది కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షుడు కంపా గంగాధర్‌రెడ్డి, పొట్నూరి దుర్గా ప్రసాద్, బెవర అసిరినాయుడు,తదితర నేతలు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఊరేగింపుగా బయలుదేరి బీఆర్‌టీఎస్ రోడ్ సెంటర్‌లో ప్రారంభమైన ర్యాలీలో పాల్గొన్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్ కింద
పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపర్చాలి
*వీఎంసీ అధికారులకు కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశం
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 19: స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే జరుగుతున్న ప్రస్తుత తరుణంలో నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులను మరింత మెరుగుపర్చాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పేర్కొన్నారు. న్యూ రాజరాజేశ్వరీపేటలో ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఇంతియాజ్ స్థానిక పరిసర ప్రాంతాలను ఆకస్మికంగా పర్యటించి స్థానిక సమస్యలను, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికలు పలు సమస్యలను కలెక్టర్‌కు విన్నవించగా, అందుకు స్పందించిన ఆయన నగరాన్ని పరిశుభ్రంగాను, సుందరంగాను తీర్చిదిద్దేందుకు వీఎంసీ అధికారులు విస్తృత చర్యలు తీసుకోవాలన్న ఆయన ఈ కార్యక్రమాల్లో నగర ప్రజలు కూడా తమవంతుగా భాగస్వామ్యం కావాలని, ప్రస్తుతం జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరానికి ఉత్తమ ర్యాంకు వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.