విజయవాడ

కార్మికుల ప్రయోజనాలు దెబ్బతింటే ఉద్యమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జనవరి 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యపడనందున దీనిని కార్పొరేషన్‌గా ఉంచుతూ, ఉద్యోగులుగా పనిచేస్తున్న 51,488 మందిని పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంటులోకి మార్చిన ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలు దెబ్బతినేలా ప్రయత్నించ వద్దని ఏపీఎస్‌ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు పేర్కొన్నారు. విలీనం పేరుతో మభ్యపెట్టి కార్మికుల ప్రయోజనాలు దెబ్బతినేలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తిరిగి ఉద్యమిస్తామని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన సెక్రట్రీస్ కమిటీ సంస్థలో పనిచేస్తున్న గుర్తింపు కార్మిక సంఘంతో గాని, మిగిలిన సంఘాలతో గాని ఎటువంటి చర్చలు జరపకుండా నిర్ణయాలు తీసుకుందన్నారు. నవంబర్ 14న సెక్రట్రీస్ కమిటీకి యూనియన్లు ఇచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చుతున్నందున 6దశాబ్దాలుగా ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న అన్ని సౌకర్యాలను తొలగిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేవి మాత్రమే వస్తాయని చెపుతూ విలీనం కమిటీ ఏకపక్షంగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. దానిని యథావిధిగా అమలు పర్చేందుకు యాజమాన్యం సోమవారం జరగనున్న ఆర్టీసీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని చేస్తున్న ఆలోచనలను విరమించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న ఏ ఒక్క సౌకర్యం తొలగించినా సరే ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్‌గా రాష్టవ్య్రాప్తంగా ఉన్న సంఘాలను కలుపుకుని ఐక్య ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న మెడికల్ అండ్ బస్సు పాస్ సౌకర్యాలు, రిటైర్ అయ్యేక ఇచ్చే రవాణా, మెడికల్ సౌకర్యాలతో పాటు ఎస్‌ఆర్‌బీఎస్ అండ్ ఎస్‌బీటీలను అలాగే గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న అన్ని సౌకర్యాలు పీటీడీలో కూడా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.