విజయవాడ

ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జనవరి 18: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా త్వరితగతిన కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా విజిలెన్స్ అండ్ మోనటిరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈసమావేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, వెట్టిచాకిరీ నిర్మూలన, సఫాయి కర్మాచారి నిర్మూలన, తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో షెడ్యూల్డు కులాలు, తెగల వారిపై దాడుల కేసులను త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు వీలుగా డివజనల్ స్థాయి కమిటీ సమావేశాలను ప్రతీ 3నెలలకు ఒకసారి నిర్వహించాలని ఆదేశించామన్నారు. డివిజనల్ స్థాయి కమిటీలో సబ్ కలెక్టర్, ఆర్డీవో, డీఎస్పీ, న్యాయశాఖాధికారులతో పాటు షెడ్యూల్డు కులాల, తెగల సంక్షేమ సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. డివిజనల్ స్థాయి కమిటీలలో కేసు నమోదు నుండి ఎఫ్‌ఐఆర్, విచారణ కోర్టుకు కేసు వివరాలు సమర్పించటం వంటి అన్ని దశలలోనూ పనులు వేగవంతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డివిజనల్ స్థాయిలో పరిష్కారానికి వీలుకానీ కేసులను జిల్లా స్థాయిలో సమీక్షించి, పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. దీనివల్ల కేసులు సత్వర పరిష్కారం, నిందితులకు శిక్ష పడటంతో పాటు బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. నిబంధనలననుసరించి నిర్ణీత సమయంలోగా బాధితులకు పరిహారం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటి కేసులకు సంబంధించి తాను ప్రత్యేక చొరవ తీసుకొని 2019లో 91మంది బాధితులకు రూ.75.90 లక్షలు పరిహారంగా అందించటం జరుగుతుందన్నారు. 2020లో 14మంది బాధితులకు రూ.10.75లక్షలు పరిహారంగా అందించామన్నారు. గత సమావేశంలో కమిటీ సభ్యుల సూచనల మేరకు ప్రతీ మండలం, డివిజన్ కేంద్రంలో ప్రతినెలా చివరిరోజున పౌర హక్కుల అవగాహన దినోత్సవం నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేయటం జరిగిందన్నారు. ఆయేషా కేసులో బాధితుడు పీ సత్యంబాబుకు ఎస్‌సీ కార్పొరేషన్ నుండి రూ.5లక్షలు స్వయం ఉపాధి పథకం నిమిత్తం ఋణం మంజూరుకు ఆదేశాలు జారీ చేయటం జరిగిందని, అదే విధంగా 2ఎకరాలు భూమిని అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పరిధిలో 109 కేసులు విచారణ దశలో ఉన్నాయని, 215 కేసులు పెండింగ్ ట్రయల్స్‌లో ఉన్నాయని, కమీషనర్ పరిధిలో 52విచారణ దశలోను, 91 పెండింగ్ ట్రయల్స్ దశలో ఉన్నాయని, వీటిని సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈసమావేశంలో కమిటీ సభ్యులు అన్నవరపు నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు బీ బుజ్జిబాబు, కమిటీ సభ్యులు ఓగిరాల శ్రీకాంత్, శాసన సభ్యులు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, దూలం నాగేశ్వరరావు, ఏసీబీ ఎస్‌పీ ఎన్ హరికృష్ణ, ఎస్‌పీ రవీంద్రబాబు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, సబ్ కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్, హెచ్‌ఎం ధ్యానచంద్ర, డాఆర్ ప్రసాద్, కమిటీ సభ్యులు వీ డానియేల్, బీ శాంతకుమారి, మల్లి ఆదిలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.