విజయవాడ

విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, జనవరి 18: మారిన ఆహార పట్టిక ప్రకారం మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలని జిల్లా విద్యా శాఖాధికారి రాజ్యలక్ష్మి ఆదేశించారు. 21 నుండి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో మారిన ఆహారంపై నిర్వాహకులకు శనివారం స్థానిక మండల విద్యాధికారి కార్యాలయంలో అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించినపుడే చదువులో ముందుంటారని చెప్పారు. వంట ఏజెన్సీల నిర్వాహకులు మారిన మోనూ ప్రకారం మంగళవారం నుండి విద్యార్థులకు భోజనాలు అందించాలన్నారు. ఉప విద్యా శాఖాధికారి చంద్రకళ మాట్లాడుతూ ఏరోజుకారోజు తయారు చేసే ఆహారం గురించి విద్యార్థులకు తెలియపర్చాలన్నారు. దీనివల్ల విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. రుచిగా వండి వడ్డించాలన్నారు. మండల ఇంచార్జి విద్యాధికారి కనకమహాలక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు 41మంది పాల్గొన్నారు.

20నుంచి జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన
*చేనేత, జౌళిశాఖ సంచాలకులు హిమాను శుక్లా
లబ్బీపేట, జనవరి 18: జాతీయ చేనేత వస్త్రప్రదర్శనను 20నుంచి 2వరకు మొగల్‌రాజుపురంలోని సిద్ధార్థ ఇన్సిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, కేటరింగ్ టెక్నాలజీ, కాలేజి గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నామని జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన సంచాలకులు హిమాను శుక్లా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన అద్బుతమైన చేనేత ఉత్పత్తులు సరసమైన ధరలకు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో ఉత్పత్తి అయిన చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయము కల్పించటంతో పాటు చేనేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించటానికి ఇటు వంటి కార్యక్రమాలు దోహాదపడతాయన్నారు. దేశంలో ప్రఖ్యాతి గాంచిన వివిధ రాష్ట్రాల చేనేత, పట్టు వస్త్రాలతో పాటు పర్నిసింగ్, కార్పెట్లు, ఇంకా పేరుపొందిన ఆకర్షణీయమైన వస్త్ర సముదాయములతో పాటు పట్టు చీరలు, పంజాబీ డ్రస్ మెటిరియల్స్, పొందురు కాటన్ షర్టింగ్, లుంగీలు, పంచెలు, దుప్పట్లు, టవల్స్, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటి ఇతర రాష్ట్రాలలో పేరుపొందిన చేనేత కళారూపాలు సందర్శకుల కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 75 చేనేత సహకార సంఘాల ఉత్పత్తిదారులు పాల్గొన్నట్లు తెలిపారు. సందర్శకులకు వినోదాన్ని, మానసిక ఉల్లాసం కల్పించుట కోసం ఈప్రదర్శన ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. వస్త్ర ప్రదర్శనకు ప్రవేశం ఉచితమని, అన్ని రకాల చేనేత ఉత్పత్తులు ఉత్పత్తి ధరలకు అందుబాటులో ఉంచబడతాయని తెలిపారు. కావున నగర పరిసర ప్రాంత ప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చేనేత ఉత్పత్తులను కోనుగోలు చేసి, చేనేత కళాకారులను ప్రోత్సహించవలసిందిగా ఆయన కోరారు.