విజయవాడ

ఇంధన పొదుపుతో విద్యుత్ ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 14: ప్రజలు ఇంధన పొదుపును అలవాటు చేసుకోవడం వల్ల విద్యుత్ ఆదాతో పాటు ఇంట్లోనే ఉండి విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లేనని కలెక్టర్ ఏఏండీ ఇంతియాజ్ అన్నారు. శనివారం ఉదయం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద ఇంధన పరిరక్షణ మిషన్ మరియు దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ సంయుక్తంగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఇంధన పొదుపుపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఇలాంటి పొదుపు ర్యాలీలు ఉపయోగపడతాయన్నారు. ప్రజలందరూ వృథాగా విద్యుత్‌ను వాడకుండా తమ అవసరాలకు ఉపయోగించుకోవడం వల్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లేనన్నారు. అంతేకాకుండా పొదుపుగా విద్యుత్‌ను ఉపయోగించడం వల్ల భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. సహజంగా మనం ఇంట్లో వాడే పరికరాల వచ్చే కరెంట్ బిల్లు ఎక్కువగా 30నుండి 40శాతం వరకు ఫ్యాన్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు మరియు 10నుండి 20శాతం వరకు లైట్లకు వాడటం జరుగుతుందన్నారు. మనం ఆదా చేసే విద్యుత్ ఒక రైతుకో, ఒక కార్మగారానికో ఉపయోగపడుతుందన్నారు. వీటిని బాధ్యతగా వాడటం వల్ల రేపటి తరాలకు కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు జాతీయ ఇంధన పొదుపు మరియు పరిరక్షణ వారోత్సరాలను ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈనెల 14నుండి 25వరకు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనర్జీ మరియు ఎఫీషియన్సీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈఓ ఏ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఇంధన అవసరాలు పరిమితికి మించి వాడటం వల్ల ఇవాళ జాతి యావత్తూ పర్యావరణ పరిరక్షణపై ఒక సవాలును ఎదుర్కొంటుందన్నారు. ఈకార్యక్రమంలో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఎం చక్రపాణి, జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ కుమార్, ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల డా వెలగా జోషి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద ప్రారంభమైన ర్యాలీ డీవీ మానర్ వరకు కొనసాగింది.