విజయవాడ

టీడీపీ 5సీట్లు గెలిచినా గొప్పే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, డిసెంబర్ 14: రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయంపై టీడీపీ పగటి కలలు కంటోందని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఉదయం ఆయన 27వ డివిజన్‌లో పర్యటించారు. ఈసందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు నగర మేయర్ పదవి కైవసం చేసుకుంటామని పగటి కలలు కంటున్నారని, కనీసం ఐదు డివిజన్లలో కూడా వారి అభ్యర్థులు గెలవటం అనుమానమేనని అన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి జరగలేదన్నారు. ఐదేళ్ల పాలనలో వారు చూపించిన అభివృద్ధి ఎక్కడుందన్నారు. నిజంగా అభివృద్ధి జరిగితే ఘోరంగా ఓడిపోరు కదా అని మంత్రి హేళన చేశారు. అభివృద్ధి కోసమే పార్టీ మారానని పదేపదే ప్రచారం చేసుకున్న నాయకుడు తన అభివృద్ధి మాత్రమే చూసుకున్నారన్నారు. భవానీపురంలోని 27వ డివిజన్‌లో స్వాతి సెంటర్ రోడ్డు నుంచి మంత్రి వెలంపల్లి పర్యటన ప్రారంభించారు. ఏఆర్‌ఆర్ రోడ్డు, కోళ్లఫారం రోడ్డు, గాంధీబొమ్మ సెంటర్, తదితర ప్రాంతాలను సందర్శించారు. మురుగునీరు బయటకు వెళ్లలేని స్థితిలో కొన్ని వీధులున్న విషయాన్ని గమనించారు. డ్రైనేజీ పనులు చేపట్టిన ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. నిర్మాణాలు సరిగ్గా లేవంటూ మురుగు కాలువల్లో నీరు తిష్ట వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ స్టాండ్‌లోని కొత్త సచివాలయానికి కావాల్సిన వౌలిక సదుపాయాలపై అధికారులకు సూచనలు చేశారు. డివిజన్‌లో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు రూ. 5 కోట్లతో సబ్ స్టేషన్ నిర్మించనున్నామని, నిధులు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. డివిజన్‌లో అభివృద్ధి పనులను మరో రూ. 5కోట్లతో త్వరలో ప్రారంభిస్తామని మంత్రి వెలంపల్లి వివరించారు. పర్యటనలో 27వ డివిజన్ వైకాపా అధ్యక్షుడు యరడ్ల ఆంజనేయరెడ్డి, డివిజన్ నాయకులు ట్రావెల్ ఖాదర్, అన్వర్, ఎం శ్రీనివాసరెడ్డి, కేసరి కృష్ణారెడ్డి, నాయకులు మైలవరపు దుర్గారావు, రియాజ్, మద్దెల రామకృష్ణ, సూరగాని రామిరెడ్డి పాల్గొన్నారు.