విజయవాడ

వెల్లువెత్తిన ప్రజాసమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 18: వీఎంసీ కమిషనర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో ప్రజాసమస్యలు వెల్లువెత్తుతున్నాయి. నగర వాసులు పలువురు తమ సమస్యలను ఫోన్ ద్వారా కమిషనర్‌కు నేరుగా వివరించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరిస్తున్న సమస్యలను రికార్డు చేస్తున్న కమిషనర్ ప్రసన్న వెంకటేష్, వాటి పరిష్కారానికి అధికారులకు తక్షణ ఆదేశాలిస్తున్నారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఏలూరు రోడ్డులో యూజీడీ మ్యాన్‌హోల్స్ రోడ్డుకు సమాంతరంగా లేకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతోందని, వాటిని సరిచేయాలని కోరారు. శాంతినగర్ పార్కు వద్ద కల్వర్టు రోడ్ లెవెల్‌కు సమానంగా లేదని, పార్కు నిర్వహణ కూడా సక్రమంగా లేదని, పార్కులో మొక్కలు నాటి గ్రీనరీని అభివృద్ధి చేయాలని కోరారు. దీనిపై తక్షణం ఆయా చర్యలు తీసుకోవాలని ఉద్యానవన శాఖాధికారులను కమిషనర్ ఆదేశించారు. శ్రీనివాస బ్యాంక్ కాలనీలో ప్లాట్ నెంబర్ 30 వద్ద భవన నిర్మాణ సామగ్రి రోడ్డుపైనే ఉంచడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణం వాటిని తొలగించాలని కోరారు. రామలింగేశ్వరనగర్ రషీద్ వీధిలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని, ఆయుష్ హాస్పటల్ రోడ్డులో వీధిదీపాలు ఏర్పాటు చేయాలని, సత్యనారాయణపురంలో యూజీడీ సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరారు. సత్వరం ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. అదనపు కమిషనర్ కే శకుంతల, డీసీఆర్ వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

సమస్యలపై భవన నిర్మాణ కార్మికుల ధర్నా

విజయవాడ, నవంబర్ 18: ఇసుక కొరత వల్ల ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ. 10వేలు చొప్పున భృతి ఇవ్వాలని, మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరుతూ సీఐటీయు అనుబంధ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తూర్పు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. రాష్ట్ర కార్యదర్శి వి నరసింహారావు, సీఐటీయు నగర అధ్యక్షుడు బీ నాగేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి వీ గురుమూర్తి, యూనియన్ నగర కార్యదర్శి షేక్ మీరావలి, నాయకులు వైబీ రాజు, బీ బెనర్చి, వై ఎల్లారావు, తదితరులు పాల్గొన్నారు.