విజయవాడ

ఆర్టీసీ ఉద్యోగుల సొసైటీ సీపీఎస్‌కు రూ.350 కోట్లు వెంటనే చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 17: ఆర్టీసీలో సమ్మె విరమణ సందర్భంగా ఉద్యోగ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుళ సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు సంస్థ ఎండీ ఎంటీ కృష్ణబాబు ప్రస్తుతం చేపట్టిన చర్యలను స్వాగతిస్తున్నామని, అయితే సంస్థ తన అవసరాల కోసం సంస్థ కార్మికులు, ఉద్యోగుల సొసైటీలో దాచుకున్న సొమ్ములో వాడుకున్న రూ.350 కోట్లను తక్షణం చెల్లించేలా చూడాలని గుర్తింపు సంఘం ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వైవీ రావు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కార్మికులు తమ తమ అవసరాల కోసం ప్రతినెలా ఆ సొమ్మును దాచుకున్నారంటూ ప్రస్తుతం విద్యా రుణాలు, వివాహ రుణాలు మంజూరు కాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. సంస్థ యజమాన్యం ప్రతినెలా సొసైటీ సొమ్మును తీసుకుంటూ వెనక్కి తిరిగి ఇవ్వకపోవటం వలన 67 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా సొసైటీ నష్టాల పాలైందన్నారు. నిబంధనల మేర ఉద్యోగ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో ఇవ్వాల్సి ఉందన్నారు. 2013 వేతన సవరణకు చెందిన 40శాతం అరియర్స్‌ను తక్షణమే చెల్లించాలన్నారు. కారుణ్య నియామకాల్లో జాప్యం లేకుండా చూడాలని కోరారు.

సమాచార, ప్రసార మాద్యమాల్లో
అశాస్ర్తియ అంశాల ప్రచారాన్ని నిలిపివేయాలి
* మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన కమిటీ
విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 17: ప్రజల్లోని నమ్మకాలు, విశ్వాసాలను ఆసరాగా తీసుకుని కొందరు బాబాలు, స్వాములు, జ్యోతిష్యులు, సమాచార ప్రసార మాద్యమాల్లో చేస్తున్న అశాస్ర్తియ ప్రచారాన్ని నిలిపివేయాలని మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఏపీ హేతువాద సంస్థ అధ్యక్షుడు నార్నె వెంకట సబ్బయ్య మాట్లాడుతూ ప్రజలను అజ్ఞానంలోకి నెట్టివేస్తున్న ఇటువంటి చర్యలు ప్రస్తుత ఆధునిక సమాజంలో అనేతికమని, ప్రపంచంలో ఎక్కడా లేని మూఢనమ్మకాలు మన దేశంలో ఉండటం శోచనీయమన్నారు. రంగు రాళ్లు, సంఖ్యాశాస్త్రం, చేతబడి, యాగాలు చేసేవారికి, అలాగే ప్రభుత్వ రాజ్యాంగ బద్ధమైన బాధ్యతల్లో ఉన్నవారు గుళ్లకు తిరుగుతూ భక్తి ప్రచారం చేస్తున్న వార్తలను కూడా నిలిపివేయాలన్నారు. మూఢనమ్మకాల నిర్మూలనా చట్ట సాధన సమితి కన్వీనర్ మొతుకూరి అరుణ్‌కుమార్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు జే శ్రీనివాస్ మాట్లాడుతూ 1975లో ప్రపంచంలోని శాస్తవ్రేత్తలందరూ జ్యోతిష్యం, రంగురాళ్లు, సంఖ్యాశాస్త్రం తదితరాలు అశాస్ర్తియమని ప్రకటించిన సందర్భంలో వారికి నోబుల్ బహుమతి కూడా అందజేసిన విషయాన్ని గుర్తించాలన్నారు. మీడియా సంస్థలు తమ వ్యాపార ఆదాయం కోసం ప్రజలకు తీవ్ర హానిచేసే ఇటువంటి కార్యక్రమాల ప్రసారాలపై పునరాలోచన చేసి సామాజిక అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో హేతువాద నాయకులు ఉప్పు గణేష్, జే లక్ష్మీనారాయణ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు జంపా కృష్ణ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.