విజయవాడ

హంతకుణ్ని అప్పగించండి.. హతమారుస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, నవంబర్ 11: అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిని హత్య చేసిన హంతకుడిని తమకు అప్పగించాలని, తామే హతమారుస్తామంటూ నల్లకుంట గ్రామస్థులు పోలీసులకు అడ్డుపడ్డారు. పోలీసులు రాకముందే నిందితుడిని స్థానికులు చితకబాదారు. అలాగే వదిలేస్తే హతమారుస్తారని అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని తమ అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలం నుండి భవానీపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే తమ కళ్లముందు ఆడుతూపాడుతూ అందరినీ అలరించే చిన్నారి ద్వారకా హత్యను నల్లకుంట గ్రామస్థులు జీర్ణించుకోలేక పోతున్నారు. బాలిక హత్యపై గ్రామంలోనే భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం బాలిక మృతదేహం పోస్టుమార్టం నివేదిక, నిందితుని విచారణ అనంతరం తాము రాబట్టే కారణాలు అసలు మిస్టరీని బహిర్గతం చేస్తాయంటున్నారు. నిందితుడు దొరికితే చంపేద్దామన్నంత ఆవేశాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యోదంతం నల్లకుంట గ్రామంలోని ప్రతి కుటుంబంలోనూ విషాదఛాయలు నింపింది. బాలిక అదృశ్యం కేసు నమోదు చేసిన దగ్గర నుండి నిద్రాహారాలు మాని పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలను గ్రామస్థులు కొనియాడారు.
డ్రోన్ కెమెరా వినియోగం
చిత్తూరు జిల్లాలో ఐదేళ్ల బాలిక హత్యోదంతం చిక్కుముడి వీడకముందే విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో జరిగిన బాలిక అదృశ్యం కేసులో పోలీసులు ప్రతిక్షణం అప్రమత్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. పొదలు, గుబురు ప్రాంతాలు, ఖాళీస్థలాలు, గ్రామ శివారు ప్రాంతాలు అణువణువునా గాలించడానికి తొలిసారిగా డ్రోన్ కెమెరాని వినియోగించారు. ఇంతగా గాలించి రేయింబవళ్లు కష్టించినా వారి కష్టానికి ఫలితం దక్కలేదు. పక్కింటి వ్యక్తే కాలయమునిలా అత్యంత కర్కశంగా చిన్నారిని హతమార్చాడని ఊహించలేకపోయారు. భవానీపురం సీఐ డీకే మోహన్‌రెడ్డి, వన్‌టౌన్, కొత్తపేట పోలీసు స్టేషన్ల ఎస్‌ఐలు, భవానీపురం ఎస్‌ఐలు, మహిళా ఎస్‌ఐలు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. బాలిక కన్పించాలని అందరూ మనస్ఫూర్తిగా వేడుకున్నారు. అయినా చిన్నారి విగతజీవిగా గోనెసంచిలో బయటపడటం అందరి హృదయాలనూ కలచివేసింది. ఇది కలైతే బాగుండునని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వెంటే ఉన్న హంతకుడు బాలిక కోసం గాలింపు చర్యల్లో భాగస్వామిగా నటించడం గమనార్హం. తనింట్లో మృతదేహాన్ని దాచిపెట్టి పోలీసులతో కలిసి తిరిగిన హింతకుడు ఎంతటి క్రూరమైన మనస్తత్వం కలిగినవాడో పోలీసులు అంచనా వేయలేకపోతున్నారు. వెస్ట్‌జోన్ ఏసీపీ కే సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసుల పనితీరును గ్రామస్థులు అభినందించారు. అందుకే పోలీసులకు వ్యతిరేకంగా ఎలాంటి నినాదాలు చేయకుండా హంతకుడిని తమకు అప్పగించాలని మాత్రమే డిమాండ్ చేయడం గమనార్హం.