విజయవాడ

కన్నుల పండువగా మహారుద్రాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, నవంబర్ 10: భవానీపురం పున్నమీఘాట్ వద్ద కృష్ణానదీ తీరం హరహర మహాదేవ శంభోశంకర నినాదంతో మార్మోగింది. పవి త్ర కార్తీకమాసం సాయం సంధ్య వేళ లో ఆదివారం సాయంత్రం వేలాది మంది భక్తులకు కనువిందు చేస్తూ మహారుద్రాభిషేకం కన్నుల పండువగా జరిగింది. మహాదేవుని సమక్షంలో సా ధువుల డమరకం శబ్దం, శంఖారావం కృష్ణా తరంగాలను పులకింపచేశాయి. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం, హిందూ ధర్మ పరిరక్షణ సమి తి ఆధ్వర్యంలో నిర్వహించిన మహారుద్రాభిషేకం, మహాభస్మాభిషేకం అత్యం త వైభవంగా జరిగింది. ఖచ్చితంగా సాయంత్రం 6.05 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం 7.35 గంటలకు ముగిసింది. ఈ కార్యక్రమానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పర్యవేక్షణలో మహారుద్రాభిషేకంను గుంటూరు జిల్లాకు చెందిన అమ్మ ఆశ్రమ పీఠాధిపతి స్వామి జ్ఞాన ప్రసూన, క్రతువు నిర్వాహకులు లక్ష్మీనారాయణ శిష్యబృందం చేతులమీదుగా 8 అడుగుల మృతిక ‘మట్టి’ వివిధ రకాల పూలతో మహారుద్రాభిషేకం వైభవోపేతంగా జరిగింది. అనంతరం మహా భస్మాభిషేకం నిర్వహించారు. ఈ భస్మాభిషేకం ప్రాధాన్యతను నిర్వాహకులు తెలుపుతూ 25ఏళ్ల నుండి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించి సేకరించిన చితాభన్మంతో ఈనాడు మహా భస్మాభిషేకం నిర్వహించినట్లు భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పెడన, మైలవరం ఎమ్మెల్యేలు జోగి రమేష్, వసంత కృష్ణ ప్రసాద్, గన్నవరం వైసీపీ నాయకులు యార్లగడ్డ వెంకట్రావు, బొప్పన భవకుమార్, దుర్గగుడి ఈవో సురేష్‌బాబు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు, తదితరులు పాల్గొన్నారు. అయితే ముఖ్యఅతిథిగా పాల్గొనాల్సిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి అనివార్య కారణాల వలన హాజరుకాలేకపోవటం నిర్వాహకుల్లో నిరుత్సాహం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అసాంతం అలరించాయి.