విజయవాడ

ప్రజల్లో ఆరోగ్య స్పృహను పెంచడం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్): అమరావతి అభివృద్దిని కాం క్షిస్తూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉం డాలని, ఆరోగ్య స్పృహ ప్రజల్లో పెం చడం ఎంతో అవసరమని కలెక్టర్ ఏ ఎండీ ఇంతియాజ్ అన్నారు. ఆదివారం బందరురోడ్డులోని డీ అడ్రస్ మాల్ నుండి విజయవాడ రన్నర్స్ ఆధ్వర్యం లో విజయవాడ మారథాన్ పరుగు ఎంతో ఉత్సాహాంగా జరిగింది. ఈమారథాన్ ప్రారంభ కార్యక్రమానికి ము ఖ్యఅతిధిగా కలెక్టర్ ఇంతియాజ్ పా ల్గొని జెండా ఊపి పరుగును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమతుల ఆహారం జీవన శైలిలో మార్పులు ద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని పేర్కొన్నారు. ఈక్రమంలో సమాజం పట్ల బాధ్యతను తెలియజేయడం పర్యావరణం పట్ల అవగాహన కలిగించేందుకు విజయవాడ మారథాన్ సభ్యులు నిర్వహించే పలు కార్యక్రమాలను అభినందించారు. 21కె పరుగులో హైదరాబాద్‌కు చెందిన డా జగన్మోహన్‌రెడ్డి 1గంట 26 నిమిషాల్లో పరుగు పూర్తిచేశాడు. రన్ మూడు కేటగిరిల్లో 5కే, 10కే, 21కే జరిగింది. ఈరన్‌కు నగర ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. పరుగు జరుగుతున్న సమయంలో రోడ్డుకు ఇరువైపులా నిలబడి రన్నర్స్‌ను ప్రోత్సహించారు. రన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ టీషర్ట్, సర్ట్ఫికెట్, మెడల్ అందజేశారు. 21కె పరుగు డీ అడ్రస్ మాల్ నుండి బందరురోడ్డు మీదగా ఎంఅండ్‌ఎం, హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వద్ద యూటర్న్ తీసుకుని బందరురోడ్డు మీదుగా పశువుల హాస్పిటల్, రాఘవయ్యపార్క్, పోలీస్ కంట్రోల్ రూమ్, ఫ్లైఓవర్ మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద యూటర్న్ తీసుకుని తిరిగి డీ అడ్రస్‌మాల్ వద్దకు చేరుకుంది. ఈవిధంగా రెండుసార్లు చేస్తే 21కే పరుగు పూర్తవుతుంది. ఇలాగే ఒకసారి పూర్తిచేస్తే 10కే పరుగు పూర్తి చేశారు. 5కే పరుగు డీ అడ్రస్‌మాల్ నుండి పశువుల హాస్పిటల్, రాఘవయ్యపార్క్, బందరులాకుల వద్ద యూటర్న్ తీసుకుని తిరిగి డి అడ్రస్‌మాల్ వరకు జరిగింది. ఈకార్యక్రమంలో సీఐడీ డీజీపీ ఎన్‌వి త్రివిక్రమ వర్మ, విజయవాడ రన్నర్స్ చైర్మన్ టీ మణిదీపక్, శ్రీరామ్ సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి నిరంజనరావు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఆర్.సుందర్, రావి రమేష్‌బాబు, టీ బసవేశ్వరరావు, ఆర్ రాము, తదితరులు పాల్గొన్నారు.