విజయవాడ

ఘనంగా వేదవ్యాపక ఆదివారం వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, నవంబర్ 10: ద్వితీయ వాటికన్ మహాసభలలో క్రీస్తు సువార్తను వ్యాప్తిచేయటంలో కేవలం పీఠాధిపతులు, గురువులు, కన్యాస్ర్తిలు మాత్రమే కాకుండా గృహస్థ క్రైస్తవులు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వటం జరిగిందని విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు తెలిపారు. వేదవ్యాపక ఆదివారం (కీస్తుసువార్తవేడుకలు) పురస్కరించుకొని పటమట నిర్మలా కానె్వంటు పక్కన సెయింట్ పాల్ కథెడ్రల్‌లో ఆదివారం ఉదయం వేదవ్యాపక వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు వ్యాకోపదేశం చేస్తూ క్రైస్తవ భక్తులు ప్రతి ఒక్కరూ ఇతర మతాల పట్ల గౌరవ, మర్యాదలు కలిగి ఉండాలని పిలుపు నిచ్చారు. వేదవ్యాపక ఆదివారం సందర్భంగా క్రైస్తవ భక్తులు ఇచ్చే కానుకలను ప్రపంచవ్యాప్తంగా సకల జనులకు క్రీస్తు సువార్తను బోధించటం, పేదలకు సాయం చేయటం కోసం ఉపయోగించటం జరుగుతుందన్నారు. పోప్ ఫ్రాన్సీస్‌వారు ఈ అక్టోబర్ నెలను ప్రత్యేక వేదవ్యాపక నెలగా ప్రకటించటం జరిగిందని చెప్పారు. అపోస్థులైన పునీత థోమస్‌వారు భారతవనిలో అడుగుపెట్టి ఇక్కడ క్రీస్తు సువార్తను వ్యాప్తి చేయటం జరిగిందని గుర్తుచేశారు. విద్య, వైద్య రంగంలో క్రైస్తవ మిషనరీలు విశేష సేవలందిస్తున్నాయన్నారు. అనంతరం సెయింట్ పాల్స్ కథెడ్రల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూజాపీఠంపై బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, సెయింట్ పాల్స్ కథెడ్రల్ విచారణ కర్తలు ఫాదర్ కొండ్రు సింహరాయులు, ఫాదర్ జీ జోసఫ్, ఫాదర్ భాను యశ్వంత్, తదితర గురువులు ‘సమష్టి దివ్యపూజాబలి సమర్పించారు. పూజానంతరం కతోలిక క్రైస్తవులకు బిషప్ జోసఫ్ రాజారావు, ఫాదర్ కొండ్రు సింహరాయులు, తదితర గురువులు దివ్యసత్ప్రసాదం అందచేశారు. వేదవ్యాపక్త ఆదివారం సందర్భంగా సెయింట్ పాల్స్ కథెడ్రల్ ప్రాంగణంలో మారిస్‌స్టెల్లా కళాశాల సిస్టర్లు, సెయింట్ పాల్స్ కథెడ్రల్ వినె్సంట్ డీ పాల్ సొసైటీ, యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్స్ భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బండి బాబురావు, మధిరి బెర్నాడ్, తదితరులు పాల్గొన్నారు.