విజయవాడ

శరవేగంగా విమానాశ్రయం అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), అక్టోబర్ 23: దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు సుమారు 48 సర్వీసుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతూ, ఇటు కార్గొ సర్వీసుల్లోనూ గన్నవరం విమానాశ్రయం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని విమానాశ్రయం డైరెక్టర్ జీ మధుసూదనరావు తెలిపారు. ప్రతినెలా సుమారు లక్ష మంది వరకు ఇక్కడి నుండి రాకపోకలు సాగిస్తున్నట్లు చెప్పారు. కార్గో సేవలు ప్రారంభించిన నాటి నుండి పురోగతి కనిపిస్తోందన్నారు. నగరంలోని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ కార్యాలయంలో బుధవారం ‘విమానాశ్రయ అభివృద్ధి - విస్తరణ పురోగతి’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మధుసూదనరావు మాట్లాడుతూ ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు 48 విమాన సర్వీసులు నడుపుతున్నామని, త్వరలోనే వీటిని 54కు పెంచుతున్నట్లు వెల్లడించారు. విజయవాడ నుండి ప్రతిరోజూ కొత్త ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, కడపకు సర్వీసులు ఉన్నాయన్నారు. 2014 నుండి విమానాశ్రయం అన్ని విభాగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, దీంతో ప్రయాణికులు, విమానాల రాకపోకలు పెరిగాయన్నారు. దేశంలోని మరే విమానాశ్రయం అభివృద్ధి చెందనంత వేగంగా గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి చెందిందన్నారు. 2018 -19లో ప్రయాణికుల రద్దీ దాదాపు 11.92 లక్షలు ఉందని, విజయవాడ విమానాశ్రయం నుండి ఎక్కువగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయం అభివృద్ధికి కావాల్సిన కనెక్టివిటీ, రన్‌వే విస్తరణ, వౌలిక సదుపాయాలు కల్పించడం, ఇతర సౌకర్యాల ఏర్పాటుకు కొనే్నళ్లుగా ఏపీ ఛాంబర్స్ కృషి చేస్తోందని, ఇందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఛాంబర్స్ సూచించిన మరికొన్ని ప్రాంతాలకు విమాన సర్వీసుల అంశం పరిశీలనలో ఉందని చెప్పారు. గన్నవరం నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునరుద్ధరించాలని, ద్వైపాక్షిక ట్రాఫిక్ హక్కుల సదుపాయం కల్పించాలని సంబంధిత అధికారులకు పలు లేఖలు రాశారని తెలిపారు. గన్నవరం విమానాశ్రయం నుండి త్వరలోనే 350 నుండి 400 మంది ప్రయాణికుల సామర్థ్యంతో హజ్ యాత్ర అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. హజ్ యాత్రకు కేంద్ర ప్రభుత్వం 22వదిగా దీన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇక్కడ కార్గో సర్వీసులు ప్రారంభం కావడానికి ఏపీ ఛాంబర్స్ ఎంతగానో కృషి చేసిందన్నారు. 2018 జనవరి నుండి అందుబాటులోకి వచ్చిన కార్గొ సర్వీసులకు ప్రస్తుతం 40 టన్నుల సామర్థ్యం ఉందని, ఇందులో ఒక శాతం మాత్రమే ఎగుమతులకు ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న కార్గో సర్వీసులను ఎగుమతిదారులు వినియోగించుకోవాలని సూచించారు. ఇక్కడి నుండి కార్గో సేవలను వినియోగించుకుంటే రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉందన్నారు. చేపలు, రొయ్యలు, పీతలు, కోడిగుడ్లు, పువ్వులు, పౌల్ట్రీ ఉత్పత్తులు, తాజా కూరగాయలు, నిమ్మ, మామిడి, బొప్పాయి, అరటి వంటి పండ్లు ఎక్కువగా ఎగుమతి చేసే ఆస్కారం ఉంటుందని డైరెక్టర్ మధుసూదనరావు వివరించారు. ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు కేవీఎస్ ప్రకాశరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో సలహా సభ్యుడు మురళీకృష్ణ, జనరల్ సెక్రటరీ పొట్లూరి భాస్కరరావు, సుమారు 40మందికి పైకా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.