విజయవాడ

12న కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు మంగినపూడి బీచ్‌లో పటిష్ట ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 23: కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ వద్ద నవంబర్ 12వ తేదీన సముద్ర స్నానాలు కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలు, చిలకలపూడి పాండురంగస్వామి రథోత్సవం నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్‌తో కలిసి మంత్రి పేర్ని నాని సమీక్షించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ వద్ద సముద్ర స్నానాలు ఆచరించేందుకు సుమారు రెండు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అందుకు తగిన పటిష్టమైన ఏర్పాట్లకు పక్కా ప్రణాళిక రూపొందించాలన్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు, మత్స్య, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, ఆర్టీసీ, మున్సిపల్ తదితర శాఖ అధికారులు సమన్వయంతో సమర్ధవంతగం పని చేయాలన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ముడ వీసీ విల్సన్ బాబు చీఫ్ కోర్డినేటర్‌గా వ్యవహరిస్తారని మంత్రి పేర్ని నాని చెప్పారు. అధికార యంత్రాంగం పైనే నిర్వహణ భారం పెట్టకుండా తాను స్వయంగా బీచ్‌లో 400 లైట్లు విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య సిబ్బందికి జాకెట్లు, వలంటీర్లకు టీ షర్టులు సమకూరుస్తామన్నారు. మంగినపూడి బీచ్ వద్ద వంద మంది గత ఈతగాళ్లు, 20 పడవలకు రెండు షిప్ట్‌లో నియమించడం జరుగుతుందని వీరికి అదనంగా ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా సేవలు అందిస్తాయన్నారు. ఐదు ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంతోపాటు అత్యవసర సేవల వినియోగానికి 108 వాహనాలకు బదులుగా ప్రైవేట్ ఆసుపత్రుల అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 9వ తేదీన చిలకలపూడి పాండురంగస్వామి రథోత్సవం, మంగినపూడి బీచ్‌లో నవంబర్ 12న కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలు కార్యక్రమాలు ఉంటాయన్నారు. జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ప్రశాంత వాతావరణంలో కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలు నిర్వహణ ఏర్పాట్లు చేయాలన్నారు. పారిశుద్ధ్య పరిస్థితులను కార్యక్రమ నిర్వహణ రెండు రోజుల ముందు నుండి చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్‌పీ రవీంద్రనాథ్, జాయింట్ కలెక్టర్ డా కే మాధవీలత, జేసీ 2 కే మోహన్‌కుమార్, డీఆర్‌ఓ ఏ ప్రసాద్, ముడ వీసీ విల్సన్ బాబు, ఎస్‌డీపీ ఎం చక్రపాణి, డీఎస్‌పీ ఎండీ మహబూబ్ బాషా, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

కృష్ణాకు మళ్లీ వరద
* లోతట్టు ప్రాంతవాసుల్ని అప్రమత్తం చేయాలి * అధికారులకు కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశం

విజయవాడ, అక్టోబర్ 23: అధిక వర్షాల వలన ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు వస్తున్న కారణంగా లోతట్టు ప్రాంతాలోని ప్రజలను అప్రమత్తం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి జిల్లాలో అధిక వర్షాలు, వరదలు, ఇళ్ల స్థలాల విషయంపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక వర్షాలు, వరదల వలన ఎవరూ ఇబ్బందులు పడకుండా అవసరమైతే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డా కే మాధవీలత మాట్లాడుతూ ఉగాది ఎంతో దూరం లేదని అవసరమైన ఇళ్ల స్థలాలకు సేకరించవలసిన స్థలాలను సమయం దృష్టిలో పెట్టుకుని చురుకుగా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ హెచ్‌ఎం ధ్యాసచంద్ర, అదనపు మున్సిపల్ కమిషనర్ శకుంతల, వివిధ మండల తహశీల్దార్లు పాల్గొన్నారు.