విజయవాడ

ఇది ముమ్మాటికీ రైతు వంచన పథకమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), అక్టోబర్ 15: పాదయాత్రలో రైతులకు ఒకేసారి రూ. 12,500 చెల్లిస్తానని హామీ ఇచ్చి వారి ఓట్లతో గద్దెనెక్కిన సీఎం జగన్ తీరా ఇపుడు నమ్మద్రోహ్రం చేశారని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ విమర్శించారు. ఈ పథకానికి రైతు భరోసా అని కాకుండా రైతు వంచన పథకం అని పేరుపెడితే బాగుంటుందన్నారు. నగరంలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముమ్మాటికీ ఇది రైతు వంచన పథకమేనని ధ్వజమెత్తారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని అనుసరించి రైతులకు ఒకేసారి మొత్తం డబ్బును చెల్లించాలని డిమాండ్ చేశారు. హామీలకు అనుగుణంగా రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వకుండా దానిలో సగం డబ్బుకు కోత విధించి, అదేదో ఘనకార్యంలా గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రైతులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతు భరోసా పథకం కింద కేంద్ర ప్రభుత్వ వాటాతో కలిపి రూ. 19, 500 రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చే ఐదేళ్లలో ఒక్కో రైతు రూ.30వేల చొప్పున నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక పథకమంటూ ఆర్భాటాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో దీనికి రూ. 8750 కోట్లు కేటాయించి, అందులో కేవలం రూ.4000 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోందన్నారు. ఈ పథకాన్ని కేవలం ప్రచారం కోసమే వాడుకుంటూ అంకెల గారడీతో రాష్ట్ర రైతులను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. గతంలో సీఎం జగన్ ఈ పథకం ద్వారా 70లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని పదేపదే చెప్పి, అర్హుల జాబితాలో కేవలం 40లక్షల మందిని మాత్రమే చేర్చటం దారుణమన్నారు. రాష్టవ్య్రాప్తంగా సుమారు 12లక్షల మంది కౌలురైతులు ఉంటే వారిలో ఒక్కరికీ ఈ పథకం వర్తించడం లేదన్నారు. ఈ చర్యల ద్వారా వైసీపీది రైతు వ్యితిరేక ప్రభుత్వమని నిరూపితమైందన్నారు. కౌలు రైతుల కష్టాలపై మొసలి కన్నీరు కారుస్తున్న ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతుల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు. ప్రతీ సంక్షేమ పథకంలో అనేక నిబంధనలను కొత్తగా చేర్చుతూ, షరతులు విధిస్తూ లబ్ధిదారుల సంఖ్యలో కోతలు విధిస్తూ తామేదో గొప్పగా చేశామనే ప్రచారం చేసుకోవటం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదన్నారు. రైతులకు లబ్ధి చేకూర్చే రైతు రుణమాఫీ పథకం రద్దుచేస్తూ జీవో జారీ చేయటమంటే ఇది రైతుద్రోహి ప్రభుత్వం కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇలాగే రైతు వ్యతిరేక విధానాలు కొనసాగిస్తే జనసేన పార్టీ ఉద్యమిస్తుందని వెంకట మహేష్ హెచ్చరించారు.

కౌలురైతుల బతుకులు మారేదెన్నడు?
కంకిపాడు, అక్టోబర్ 15: ప్రభుత్వాలు మారుతున్నా కౌలురైతుల బతుకుల్లో మార్పులు రావటంలేదని బీసీఎంఎం జాతీయ నాయకుడు వీ శ్రీనివాసరావు అన్నారు. స్థానిక మండేపూడి నాగభూషణ్ రెడ్డి భవనం వద్ద మంగళవారం కౌలురైతు సంఘం జిల్లా రెండో మహాసభలు నిర్వహించారు. దీనిలోభాగంగా ప్రగతి పబ్లిక్ స్కూల్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ప్రదర్శన జరిపారు. ప్రజానాట్య మండలి కళాకారులు వివిధ సమస్యలపై కళారూపాలు ప్రదర్శించారు. మహాసభలో ముఖ్యఅతిథిగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు, కౌలురైతులు తమ ఓటుహక్కు ద్వారా బుద్ధి చెప్పినా పాలకుల వైఖరిలో మార్పు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటకు ధర విషయంలో కేరళ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలన్నారు. ప్రతి కౌలురైతుకు గుర్తింపు కార్డు ఇవ్వాలని, కౌలురైతులకు పథకాలు కులాల వారీగా అమలు చేయటం సరికాదని ఖండించారు. కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం హరిబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ఎంతో కష్టపడి సాధించిన కౌలు చట్టానికీ తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు కార్డులు ఇచ్చే విధానం అమలు చేయాలని, స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని కోరారు. కౌలురైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పంచకర్ల రంగారావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జీ నాగేశ్వరరావు, వివిధ సంఘాల ప్రతినిధులు రాజేష్, డీ రవి, జీ మరియదాసు, ఎం జయమ్మ, తదితరులు పాల్గొన్నారు.