విజయవాడ

మండల సమస్యలపై సబ్ కలెక్టర్ ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, అక్టోబర్ 15: కొత్తగా వచ్చిన సబ్ కలెక్టర్ హెచ్‌ఎం ధ్యానచంద్ర మంగళవారం పెనమలూరు తహశీల్దారు కార్యాలయాన్ని సందర్శించారు. మండలంలోని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటర్ల జాబితా తయారీ, ఓటర్ల జాబితాలో మార్పుచేర్పులు, సవరణలు ఈ నెల 25లోగా పూర్తికావాలని అధికారులకు అదేశించారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల స్పందనపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలపై దృష్టిపెట్టి సత్వరం పరిష్కరించటానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ధ్యానచంద్ర సూచించారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో తహశీల్దారు జీ భద్రునాయక్, డిప్యూటీ తహశీల్దారు ఆదిలక్ష్మి, డిప్యూటీ తహశీల్దారు ఉదయభాస్కర్ పాల్గొన్నారు.

ప్రజలకు రక్షణే పోలీసుల కర్తవ్యం
పెనమలూరు, అక్టోబర్ 15: ప్రజల మాన ప్రాణరక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్రుణప్రాయంగా త్యజించే వారే పోలీసులని సీఐ ముత్యాల సత్యనారాయణ అన్నారు. పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని నారాయణ స్కూల్ విద్యార్థులు 40మంది మంగళవారం పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. సీఐ సత్యనారాయణ పోలీస్ స్టేషన్‌లోని పలు విభాగాలు, ఆయా అధికారులు నిర్వహించే విధులు, పోలీసులు ఉపయోగించే ఆయుధాలను గురించి విద్యార్థులకు వివరించారు. పోలీసులు తయారుచేసే రికార్డులు, ఎఫ్‌ఐఆర్‌ల గురించి తెలియజేశారు. పోలీసులు ఆయుధాలను ఎలా వాడతారో విద్యార్థులకు చూపించారు. పౌరులుగా పోలీసులకు ఎలా సహకరించాలి, ఆపదలో ఉన్నవారికి ఎలా సహాయం చేయాలి, వారికి ఎలాంటి రక్షణ కల్పించాలి అనే విషయాలు తెలిపారు. చోరీలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరిగిన తక్షణం పోలీసులకు సమాచారం అందించాలని ఆయా విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పోలీసు శాఖ ఆధ్వర్యాన పోలీసు శాఖపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు అక్టోబర్ 21న ముగింపు సభలో బహుమతులు అందజేయనున్నట్లు సీఐ తెలిపారు. ఈ వారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లు సత్యనారాయణ వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు వెంకటేష్, వరలక్ష్మి, దుర్గాప్రసాద్, తమ్మినాయుడు, రైటర్ బాల, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, శివకృష్ణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.