విజయవాడ

కొనసాగుతున్న హుండీల లెక్కింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), అక్టోబర్ 15: ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన హుండీల లెక్కింపు కొనసాగుతోంది. దసరా ఉత్సవాల 10 రోజుకు సంబంధించి హుండీలను లెక్కించే పనిని అధికారులు చేపట్టారు. ఈ నెల 14న సోమవారం ప్రారంభమైన లెక్కింపు మంగళవారం కూడా కొనసాగుతోంది. రెండోరోజు హుండీల లెక్కింపులో సుమారు రూ. 3కోట్ల నగదు అమ్మవారికి భక్తులు సమర్పించినట్లు తేలింది. ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్‌బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న హుండీల లెక్కింపులో భక్తులు పెద్దఎత్తున సమర్పించిన నగదు, బంగారు, వెండి వస్తువుల విలువలను ఆలయ సిబ్బంది గణిస్తున్నారు. మంగళవారం హుండీల లెక్కింపులో నగదు రూ. 3కోట్ల 57వేల 339, బంగారం 595 గ్రాములు, వెండి 9.950 కేజీలు భక్తులు కానుకల రూపంలో అమ్మవారికి సమర్పించినట్లు గుర్తించారు. ఇప్పటివరకు రెండ్రోజుల లెక్కింపు ద్వారా నగదు రూ.5కోట్ల 85లక్షల 82వేల 939 కాగా, బంగారం కేజీ 115 గ్రాములు, వెండి 24 కేజీల 150 గ్రాములు లభించింది. దసరా ఉత్సవాల్లో 10రోజులు సమారు 17లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అంచనా.

దుర్గమ్మ సేవలో కర్నాటక మంత్రి ఈశ్వరప్ప
* సాదర స్వాగతం పలికిన అధికారులు
విజయవాడ (సిటీ), అక్టోబర్ 15: ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామిని కర్నాటక రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప దర్శించుకున్నారు. మంగళవారం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా ఈవో సురేష్‌బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి మంత్రి ఈశ్వరప్ప దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు వేదాశీర్వచనాలు అందించగా, ఈవో సురేష్‌బాబు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు.

అన్నసంతర్పణకు విరాళం
విజయవాడ (సిటీ), అక్టోబర్ 15: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి ఓ భక్తుడు భారీ విరాళం అందించాడు. మంగళవారం ఆలయ ఈవో సురేష్‌బాబును కలిసిన హైదరాబాద్‌కు చెందిన కౌత సత్యనారాయణమూర్తి, లక్ష్మీస్రవంతి, క్రాంతి అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి 2లక్షల 80వేల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో అందజేశారు. దాతలకు అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజలను అధికారులు చేయించారు. వేద పండితులు వేదాశీర్వచనాలు అందించగా, ఆలయ ఈవో సురేష్‌బాబు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని బహూకరించారు.