విజయవాడ

రామాయణాన్ని మహాకావ్యంగా మలిచిన మహార్షి వాల్మికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), అక్టోబర్ 13: రాముడి జీవిత చరిత్రను రామాయణ మహాకావ్యంగా అందించిన మహా వ్యక్తి మహర్షి వాల్మికి అని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. నగరంలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అదివారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మికి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి కలెక్టర్ ఇంతియాజ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహర్షి వాల్మికి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ రామాయణాన్ని శాస్ర్తియ దృక్ఫథంతో రసజ్ఞ సౌందర్యాన్ని కలితామయంగా మేళవించిన మహా పురుషుడు వాల్మికి అని తెలిపారు. మహర్షి వాల్మికి చరిత్రను ఒక సినిమాలో ప్రముఖ సినీ కవి వేటూరి వాల్మికిపై రాసిన పాట తనకి ఇప్పటికీ గుర్తుగానే ఉందన్నారు. కృషి ఉండే మనుషులు ఋషులౌతారు మహా పురషులౌతారు తరతరాలకు తరగతని వెలుగౌతారు ఇలవేల్పులౌతారు అంటూ పాటను పాడి వినిపించారు. వాల్మికిపై రాసిన పాట వారి వాల్మికి చరిత్రను అవగాహన కలిగించడం అవుతుందన్నారు. వాల్మికి నవరస భరితం రాముని చరితం జగతికి అందించిన అమృత వర్షమన్నారు. విద్య అనేది అభివృద్ధికి మూలమని తన ప్రగాఢ విశ్వాసం అన్నారు. అందుకే సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులై సమాజంలో మరో నలుగురికి మేలు చేసే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతపురం జిల్లాలో 45వేల మంది ఫీజు రియింబర్స్‌మెంటుకు దరఖాస్తు చేయగా వారిలో 19వేల మంది వాల్మిక బోయ కులస్థులకు చెందిన వారేనన్నారు. దీనిని బట్టి ఆ కులస్థులు కూడా విద్యపై ఆసక్తి చూపడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. నగరంలోని వాంబే కాలనీకి వాల్మికి వాంబే అనే పేరుతో పేర్కొనే విషయంపై నగరపాలక సంస్థ అధికారులకు సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. బోయ వాల్మిక కులస్థులకు బ్యాంకుల ద్వారా వివిధ వృత్తులు చేపట్టేందుకు రుణాలు అందించేందుకు
చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయంపై వాల్మిక సేవా సమితి సభ్యులు, బ్యాంకర్లు, అధికారులతో ఒక వారంలో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ 24వేల శ్లోకాలతో అజరామమైన రామాయణాన్ని భారతీయులకు వారసత్వ సంపదగా మహర్షి వాల్మికి అందించారన్నారు. రామాయణం సామాజిక నీతిని బోధిస్తుందన్నారు. ఒక బోయవాడు పరిణితి చెంది అద్భుతమైన రామాయణ మహా కావ్యాన్ని రాశారన్నారు. మహర్షి వాల్మికిని అందరూ ఆదర్శంగా తీసుకుని విద్యావంతులు కావాలన్నారు. వారు రాసిన రామాయణం తల్లిదండ్రులు, భార్యా భర్త, గురు శిష్యులు, భగవంతుడు, భక్తుడు మధ్య సంబంధ బాంధవ్యాలను తెలుపుతుందన్నారు. రాష్ట్రంలో బీసీలకు బోయ వాల్మికులకు, చట్టసభల్లో, క్యాబినెట్లో సీఎం జగన్ ప్రత్యేక స్థానం కల్పించారన్నారు. బోయలను ఎస్టీల జాబితాలో చేర్చే విషయంపై సీఎం జగన్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో ఆహార కమిషన్ సభ్యురాలు కృష్ణమ్మ, బీసీ సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు భార్గవి, ఆర్‌డీవో ఎం చక్రవాణి, వాల్మికి సేవా సమితి సభ్యులు హనుమంతరావు, బోయ, వాల్మికి, బీసీ సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.