విజయవాడ

నిద్రావస్థలో నిఘా నేత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, అక్టోబర్ 13: నగరంలో నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. ఎలాంటి ప్రమాదాలు జరిగినా, చైన్ స్నాచింగ్‌లు, బైక్ చోరీలు జరిగినా, హత్యలు హత్యాయత్నాలు జరిగినా నగరంలోని ప్రధాన రహదారుల్లోని సీసీ కెమెరాలు ఆ దృశ్యాలను నిక్షిప్తం చేసేది. 15 రోజులుగా నగరంలోని సీసీ కెమెరాల విభాగం పనిచేయడం లేదు. లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన కెమెరాలు నేడు అలంకారప్రాయంగా మారాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏ మూలన ఏం జరిగినా కలెక్టర్ కార్యాలయంలో వీక్షించేలా ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయం నుండి ఏకంగా సీఎం కార్యాలయానికి అనుసంధానం చేశారు. అయితే అలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేడు పనిచేయడం లేదు. నగరవ్యాప్తంగా వేలాది సీసీ కెమెరాలు బిగించారు. నాలుగు రోడ్ల కూడళ్లలో, ప్రధాన రహదారుల్లో జాతీయ రహదారులు కలిసే చోట ఇలా నగరమంతా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీసు కంట్రోలు రూంలో ఏర్పాటు చేసిన ప్రధాన స్క్రీన్‌పై నగరంలోని సీసీ కెమెరాల ఫూటేజ్‌లు కన్పించేవి. దానివల్ల ఏ క్షణంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగింది, అలాగే ప్రమాదాలు జరగడానికి గల కారణాలు, బాధితులు, నిందితుల పూటేజీలు నిక్షిప్తమయ్యేవి. హిట్ అండ్ రన్ వాహనాలను గుర్తించడానికి ఈ సీసీ కెమెరాల పూటేజీలు ఉపయోగపడేవి. నేడు నగరంలోని అన్ని కెమెరాలు కునుకు తీస్తున్నాయనే చెప్పాలి. చైన్ స్నాచింగ్ జరిగిన దృశ్యాలు నిందితులు ఏ బైక్‌పై వచ్చారు. ఆ బైక్ నంబర్, నిందితుల ముఖారవిందాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యేవి. రెండేళ్ల క్రితం తప్పిపోయిన చిన్నారిని గుర్తుతెలియని మహిళలు కిడ్నాప్ చేయగా నగరంలోని సీసీ కెమెరాల ఫూటేజీల ఆధారంగా వారు ఎటు వెళ్లింది, నిర్థారించుకుని గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన మహిళ బాలికను తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. విశాఖ నుండి దుర్గగుడికి వచ్చిన ఆ బాలిక (6) అదృశ్యంపై వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆనాడు దుర్గగుడిపై సీసీ కెమెరాలు పనిచేయలేదు. వన్‌టౌన్ సీఐ డీ కాశీ విశ్వనాథ్ కెనాల్ రోడ్డులోని సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించాక ఆ బాలికను ఓ మహిళ వెంట తీసుకెళ్లిందని గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన బాలిక కిడ్నాప్ కేసును సీసీ కెమెరాల ఫూటేజీల ఆధారంగా ఛేదించిన పోలీసుల పనితీరుపై ఆనాటి సీఎం సైతం స్పందించి పోలీసులను అభినందించారు. నేటి డీఐజీ సవాంగ్ ఆనాడు నగర పోలీసు కమిషనర్‌గా ఉన్నారు. ఆయన కూడా తమ సిబ్బందిని
అభినందించారు. ఇటీవల సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ పరిధిలో భార్యను హతమార్చిన భర్త ఆమె తలను మొండెంని వేరు చేసి ఏలూరు కాలువలో తలను విసిరేసిన విషయాన్ని నిందితుడు అంగీకరించినా సీసీ కెమెరాల ఫూటేజీ ఆధారంగా హతురాలి భర్తే హంతకుడిని పోలీసులు నిర్థారించారు. నేరాలు ఘోరాలు జరిగిన వెంటనే నిందితులు ఎటు పరారయ్యారనే అంశాలను, ఏ వాహనం ఉపయోగించారనే విషయాలను నిర్థారించడానికి సీసీ కెమెరాలే ఉపయోగపడ్డాయి. అంతటి ప్రాధాన్యత గల సీసీ కెమెరాల నిఘా నేత్రం నేడు నిద్రావస్థలోకి చేరుకుంది. టీడీపీ ప్రభుత్వంలో సీసీ కెమెరాల నిర్వహణ బాధ్యతను తొలుత ఆర్‌వీఆర్ సంస్థకి అప్పగించారు. కొన్నాళ్ల తరువాత మ్యాట్రిక్స్ సంస్థకి బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వాలు మారాక గత ప్రభుత్వం కేటాయించిన సంస్థలు, వాటి నిధులపై ఆరాతీయడంతో సీసీ కెమెరాల విధులు నిర్వహణ విషయంలో కూడా పారదర్శకత లేదని లోపాలున్నాయని గ్రహించిన ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం మ్యాట్రిక్స్ సంస్థ పనులకు చెక్ పెట్టింది. పునఃసమీక్ష జరుగుతుందని విశ్వసనీయంగా తెలిసింది. ఆనాటి కలెక్టర్ ఎస్‌కే బాబు ఆధ్వర్యంలో కమాండింగ్ కంట్రోల్ - రియల్ టైం గవర్నెన్స్ విధానానికి నేటి ప్రభుత్వం తాత్కాలిక విరామం ఇచ్చింది. మ్యాట్రిక్స్ సంస్థకు బదలాయించిన పనులు, నిధులు లెక్కలు తేల్చడానికి ప్రస్తుతం సీసీ కెమెరాలను నగరంలో ఆపేశారు. నగరంలోని పోలీసు కంట్రోల్ రూం అనుసంధానంగా పనిచేస్తున్న అన్ని సీసీ కెమెరాలు నేడు పనిచేయడం లేదు. షాపులు, పలు సంస్థల యజమానులు సొంతంగా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయి. దీనివల్ల పోలీసుల దర్యాప్తుల్లో కీలక భాగంగా మారిన సీసీ కెమెరాలు అలంకార ప్రాయంగా మారాయి.