విజయవాడ

జగన్మత సేవలో ఎమ్మెల్యే నంబూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 18: నగరంలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మను పెదకూరపాడు శాసనభ్యుడు నంబూరు శంకర్‌రావు కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకున్నారు. ఎమ్మెల్యేకి ఈవో సురేష్ బాబు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. దర్శనంతో పాటు అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలను నిర్వహించారు. దుర్గమ్మ అలంకరణ కోసం 135 గ్రాముల బరువు ఉన్న బంగారు లక్ష్మీ కాసుల హారంను దేవస్థానంకు అందించారు. ఈహారానికి రాళ్ల సూత్రాలు బంగారు తీగతో చుట్టబడి ఉంది. ఇందులో 62 లక్ష్మీకాసులు, 142 తెలుపు రాళ్లు, 2 ఎరుపు రాళ్లు, మరియు నాన్ కోడు ఉన్నాయి. ఈసందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్‌రావు కుటుంబ సభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వచనాలను అందించారు. ఈవో సురేష్ బాబు ప్రసాదంతో పాటు దుర్గమ్మ చిత్రటాన్ని బహుకరించారు.

ఆంధ్ర క్రికెట్ అండర్-16 జట్టు ఎంపిక
విజయవాడ (ఎడ్యుకేషన్), సెప్టెంబర్ 18: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండర్-16 క్రికెట్ జట్టును ఎంపిక చేసినట్లు ఏసీఏ కార్యదర్శి సీహెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. ఎంపికైన జట్టు హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగే విజయ్ మర్చంట్ ట్రోఫీలో పాల్గొంటుందన్నారు. ఎంపికైన జట్టు సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్‌కే రషీద్ (కెప్టెన్), కే రేవంత్‌రెడ్డి, ఎం మహేంద్రయాదవ్, ఎం అభినావ్, ఎస్‌కే కాజా మోహీద్ధీన్, పీ అర్జున్ టెండూల్కర్, జీ మల్లిఖార్జున్, వీ లోహిత్, బీ సాయి సుశాంత్, టీ జతీన్, జీజీ పార్థసారథి, అదిల