విజయవాడ

అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఆగస్టు 25: మైలవరం పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వైసీపీ మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ అక్కల రామ్మోహనరావు(గాంధీ) డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు మైలవరం పట్టణంలోని అనేక ప్రాంతాలలో అంతర్గత రోడ్లు పూర్తిగా దెబ్బతిని నడవటానికి వీలు లేకుండా పోయిందని ఆయన అన్నారు. ఆదివారం మైలవరం పట్టణంలోని పాడైన రోడ్లను జనసేన నేతలతో కలిసి ఆయన పరిశీలించిన అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో స్థానిక మంత్రి దేవినేని ఉమ ఆదేశాల మేరకు ఎటువంటి పాలన అనుమతులు లేకుండా సిసి రోడ్ల నిర్మాణం చేపట్టారని, దానిపై వైసీపీ నేతలు కోర్టుకు వెళ్ళటం, అధికారులకు పిటిషన్లు పెట్టటంతో రోడ్ల నిర్మాణం అర్థంతరంగా నిలిపివేశారని ఆయన పేర్కొన్నారు. ఈరోడ్లు ఇప్పుడు వర్షాలకు దారుణంగా తయారయ్యాయన్నారు. తాజాగా ఏర్పడ్డ ప్రభుత్వం వెంటనే స్పందించి నిలిచిపోయిన రోడ్లను వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా మైలవరం పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అనేక గ్రామాలలో ఇదే పరిస్థితి నెలకొందని, వాటిని గుర్తించి వెంటనే పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో పార్టీ నేతలు వైఎన్నార్, లక్ష్మి, శ్రీకాంత్, బ్రహ్మయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.