విజయవాడ

హమ్మయ్య! బయటపడిన బోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఆగస్టు 25: ఐదు రోజులుగా నానా అగచాట్లు పడిన నీటి పారుదల శాఖ అధికారులు ఎట్టకేలకు ఆదివారం పడవ బయటపడటంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం బ్యారేజీ 68 ఖానా వద్ద గేటుకు అడ్డుగా ఉన్న ఇసుక పడవను అడ్డు తొలగించడానికి అధికారులు అంచెలంచెలుగా వ్యూహాలు మారుస్తూ ప్రతిసారీ విఫలమైన విషయం విదితమే. విసుగెత్తిన వారు తలలు పట్టుకున్నారు. బ్యారేజీకి ఎలాంటి మరమ్మతులు లేకుండా పడవను అడ్డు తొలగించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో అతి జాగ్రత్తగా పని పూర్తి చేయాలనుకున్నారు. పలు రకాల తాళ్లు తెగుతూ తెగుతూ అధికారుల దుంపతెంచాయి. కాకినాడ నుండి వచ్చిన నరసింహరాజు బృందం ఆదివారం మధ్యాహ్నానికి పడవను బయటకు లాగారు. పోలవరం, అనంతపురం, బళ్లారి, కాకినాడ తదితర ప్రాంతాల నుండి ప్రత్యేక నిపుణులను రప్పించారు. శనివారం 100 టన్నుల బరువుని లాగే సామర్థ్యం కలిగిన ఇనుప మోకును ఉపయోగించి లాగినా పడవ కదిలిరాలేదు. ఆ మోకు కూడా తెగిపోయింది. దాంతో ఆదివారం ఉదయం నుండి సుమారు నాలుగు గంటల పాటు శ్రమించిన నిపుణులు విజయం సాధించారు. దాంతో అధికారులు ఊరట చెందారు. పడవను బయటకు లాగిన ప్రత్యేక బృందానికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. కలెక్టర్ ఇంతియాజ్ ఆదివారం కూడా స్వయంగా బ్యారేజీని సందర్శించి పడవ తొలగింపు చర్యలను పర్యవేక్షించారు. నీటి పారుదల శాఖ ఈఈ రాజు స్వరూప్ కుమార్, అధికారులు తమ ప్రయత్నాలు ఫలించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు.