విజయవాడ

మంత్రి వెలంపల్లికి మాతృవియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఆగస్టు 25: రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకి మాతృవియోగం కల్గింది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహాలక్ష్మమ్మ (73) ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం కుదుటపడాలని మంత్రి వెలంపల్లి అనునిత్యం కనిపెట్టుకునే ఉన్నారు. వెలంపల్లి తండ్రి సూర్యనారాయణ కన్నీరు మున్నీరు అవుతుండగా ఆయన్ని బంధువులు ఓదార్చుతున్నారు. మహాలక్ష్మమ్మకి ముగ్గురు మగ సంతానం. ఇద్దరు ఆడ సంతానం. మగవారిలో రెండో సంతానం రాష్ట్ర మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు. వెలంపల్లికి మాతృవియోగం పట్ల పలువురు వైకాపా నాయకులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సోమవారం మంత్రి స్వగృహం బ్రాహ్మణ వీధి నుండి ఆమె అంతిమ యాత్ర సాగుతుందని వెలంపల్లి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. వెలంపల్లికి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు, ప్రధాన కార్యదర్శి మారెళ్ల వంశీకృష్ణ, ఉపాధ్యక్షుడు అన్నవరపు బ్రహ్మయ్య, నగర అధ్యక్షులు తాతినేని వాసు, ప్రధాన కార్యదర్శి యేమినేని వెంకట రమణ, కోశాధికారి తాళ్లూరి అనిల్‌కుమార్‌లు సంతాపాన్ని ప్రకటించారు. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈవోల సంతాపం
రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు మాతృ వియోగం పట్ల వివిధ ఆలయాలకు చెందిన అధికారులు వేర్వేరుగా తమ సంతాపాలను తెలిపారు. ఆయన మాతృమూర్తి మరణం వారి కుటుంబానికి తీరనిలోటని, ఆమెకు ఆత్మకు శాంతి చేకూర్చాలన్నారు. ఈసంతాపాలు తెలిపిన వారిలో దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబు, దేవాదాయ శాఖ ఏసీ వీ సత్యనారాయణ, మోపీదేవి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం ఈవో జీవీడీఎన్ లీలాకుమార్ (నాని), శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఈవో గెల్లి హరిగోపీనాథ్‌బాబు, దుర్గగుడి సహాయ ఈవోలు ఎన్ రమేష్, బీ వెంకటరెడ్డి, విజయ్‌కుమార్, నెమలి దేవస్థానం ఈవో నేల సంధ్య ఉన్నారు.