విజయవాడ

వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, పశ్చిమ, ఆగస్టు 25: ఆంజనేయవాగు సెంటర్‌లోని శ్రీ కార్యసిద్ధి ఆలయం వద్ద వినాయక ఉత్సవా లు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు ను విచారిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతి వినాయక చతుర్థి ఉత్సవాలు కార్యసిద్ధి ఆలయంలో ఘనంగా జరుగుతాయి. అయితే ఆలయం వెను క నివాసముంటున్న అక్కాచెల్లెళ్లు రా యన చాముండేశ్వరి, ఇద్దిపిల్లి లక్ష్మి భ క్తులకు అంతరాయం కల్గిస్తున్నారని ఆరోపించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా భక్తులకు అడ్డుగా పెంపుడు కుక్కలు కట్టేస్తున్నారని ఆలయానికి రంగులు కూడా వేయనివ్వకుండా పని వారలను అసభ్యపదజాలంతో దూషిస్తూ గొడవలకు వస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానికులు వారి చర్యలను ఖండించినా వారందరిపైనా గొడవలకు వెళుతున్నారని గుడి కమిటీ సభ్యులు గుర్రే రామారావు, రాళ్లపల్లి ప్రసాద్, కొరికాని శివరామ్, బంకా శేషగిరిరావు, పర్ల రమాదేవిలు పోలీసులకు తమగోడు వినిపించారు. కాగా నిందితుల దౌర్జన్యాలు రుజువులతో చూపించాలని స్థానికులంతా ఏకమై ఆలయం వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు జరిగిందని బాధితులు పోలీసులకు వివరించారు. సీఐ ఎండీ ఉమర్ ఆధ్వర్యంలో మహిళా ఎస్‌ఐ ధనలక్ష్మీ ప్రసన్న కేసును దర్యాప్తు చేపట్టారు.

పాల బకాయిలు చెల్లించాలి
పెనమలూరు, ఆగస్టు 25: గత ఎడాది నుండి పాల కేంద్రంలో పోసిన పాలకు ఇవ్వాల్సిన బకాయిలను వెంట నే చెల్లించాలని పాల ఉత్పత్తి రైతు నేరె ళ్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. కానూరు ది కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్థానిక పాలకేంద్రం ముందు పాల ఉత్పత్తిదారుల నిరసన కార్యక్రమాన్ని అదివారం నిర్వహించారు. ఆవుపాలు సేకరణ రద్దు చేయటంతో ఉత్తత్తిదారులు ఆందోళనకు దిగారు. అనంతరం ఉత్పత్తిదారుడు నారాయణ మాట్లాడుతూ గత ఏడాదిగా పోసిన పాలకు ఇవ్వాల్సిన నగదు ఇవ్వకుండా రేపు, మాపు అంటూ కాలం గడిపారన్నారు. ఇప్పడు ఆవు పాలు సేకరించటం లేదు, రద్దు చేశామంటున్నారన్నారు. కానూరు గ్రామంలో సుమారు రూ.10లక్షల వరకు పాల ఉత్పత్తిదారులకు బకాయలు చెల్లించాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యే పార్థసారథి దృష్టికి తీసుకెళ్లనున్నామన్నారు. పాలకేంద్రం అధికారి నాగరాజు వివరణ బకాయి పడటం వాస్తవమేనని రెండు రోజుల్లో బకాయి పూర్తిగా చెల్లిస్తామన్నారు. ఆవుపాలల్లో కల్తీ కలిపిన పాలు కేంద్రానికి వచ్చాయని వారిని కనుగొనేందుకు తాత్కాలికంగా ఆవుపాల సేకరణ రద్దు చేశామన్నారు. ఆవుపాలల్లో కొవ్వుశాతం 2.5 ఉన్నవాటిని తీసుకుంటున్నామని తెలిపారు.