విజయవాడ

ఇళ్లపట్టాలకు నూరుశాతం అర్హులనే ఎంపిక చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), ఆగస్టు 22: ఇళ్లపట్టాలకు లబ్ధిదారుల గుర్తింపులో నూరుశాతం అర్హులను ఎంపిక చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పేర్కొన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం జిల్లాలోని ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ ఇంతియాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో గృహవసతి లేనివారికి 25లక్షల గృహాలను తక్కువ ధరకు నాణ్యత గల శాశ్వత గృహవసతి కల్పించాలని సంకల్పించి ఉగాదినాడు పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నదన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వం దీనికై ప్రత్యేకంగా రూపొందించిన ప్రొఫార్మాను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలను నమోదు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో తహసీల్దార్లు, మండల ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు నూతన ప్రొఫార్మాపై గ్రామ, వార్డు వలంటీర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 26 నుండి 30వరకు ఈప్రక్రియను నిర్వహించి ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని ప్రొఫార్మాలో నివేదించాలన్నారు. ఈప్రక్రియ ఈనెల 30కల్లా పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారుల గుర్తింపులో అన్ని జాగ్రత్తలు తీసుకుని అసలైన లబ్ధిదారుల జాబితా రూపొందించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రెవెన్యూ, గృహనిర్మాణ, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో గ్రామ వలంటీర్లతో సమావేశాలు నిర్వహించి సన్నద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
భూరికార్డుల ప్యూరిఫికేషన్ పూర్తికావాలి
జిల్లాలో భూరికార్డులను సరిచేసే ప్రక్రియలో భాగంగా జిల్లాలోని 12 మండలాల్లో ఎంపిక చేసిన 12 గ్రామాల్లో భూరికార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి కావాలని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఆర్, వెబ్ అడంగల్‌తో ల్యాండ్ రికార్డ్స్ సరిపోయేలా రికార్డులు ఉండాలన్నారు. దీనిపై సంబంధిత మండల తహసీల్దార్లు ప్రత్యేకంగా దృష్టి సారించి త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో ఆయా మండలాలు, పట్టణాలలో ప్రాథమిక నివేదిక ఆధారంగా ఇల్లులేని వారు, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిపై సమీక్షించారు. మండలాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి ఇళ్లపట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని, ఇందుకు తహసీల్దార్లు, పంచాయతీ సెక్రటరీలు, డెప్యూటీ తహసీల్దార్లు సర్వేయర్లు టీమ్‌గా ఏర్పడి గ్రామపటంతో ప్రభుత్వ భూములను గుర్తించి సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ డా కే మాధవిలత, జాయింట్ కలెక్టర్-2 మోహన్‌కుమార్, డీఆర్‌ఓ ఏ ప్రసాద్, టిడ్కో ప్రాజెక్ట్ ఆఫీసర్ చిన్నోడు, గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ధనుంజయుడు పాల్గొన్నారు.