విజయవాడ

రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తిచేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), ఆగస్టు 17: భవిష్యత్తులో ఎప్పుడు వరదలు వచ్చినా కృష్ణలంక కరకట్ట దిగువ భాగంలో ఇళ్లు ముంపునకు గురికాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ వెల్లడించారు. శనివారం ఉదయం కృష్ణానది వరద ముంపునకు గురైన గీతానగర్‌లోని భూపేష్‌గుప్తా కాలనీ, రామలింగేశ్వరనగర్‌లోని గాంధీ కాలనీలో రవాణా, సమాచారం, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బొప్పన భవకుమార్‌తో కలిసి ఆయన పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. నదిలో తీవ్ర వరద ఉద్ధృతి ఉన్నప్పటికీ మంత్రులు రిటైనింగ్ వాల్ పైకి ఎక్కి వరద పరిస్థితిని పరిశీలించారు. గాంధీ కాలనీలో వరద నీటిలోనే దిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం నాలుగు కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మించవలసి ఉండగా రెండున్నర కిలోమీటర్లు మాత్రమే పూర్తయ్యిందని మరో కిలోమీటరున్నర నిర్మించాల్సి ఉందని చెప్పారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తిచేయాలని ఈప్రాంత ప్రజలంతా కోరుతున్నారని, అంచనాలు తయారు చేయించి ముఖ్యమంత్రి రాగానే ఆయన దృష్టికి తీసుకెళ్లి, రిటైనింగ్ వాల్ పూర్తిచేయించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అమెరికా నుండి మంత్రులు, అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు, సూచనలిస్తూ అప్రమత్తం చేస్తున్నారన్నారు. వరద తగ్గుముఖం పడుతున్నా ప్రవాహ ఉద్ధృతి రెండు, మూడురోజులు ఉంటుందన్నారు. నగరంలో వరద కరకట్ట దిగువ ప్రాంతాల్లో 4వేలకు పైగా ఇళ్లలో నీరు ప్రవేశించి కొన్ని పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. 3వేల మందికి పైగా నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు చేర్చామని, అక్కడ వారికి అవరసమైన అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. రెండు జిల్లాల కలెక్టర్‌లు, మున్సిపల్, పోలీస్ యంత్రాంగం, అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. పదేళ్ల తరువాత రైతులకు పంటకు అవసరమైన నీరు వచ్చిందని, ఎక్కడైనా పంటలు దెబ్బతిని వుంటే నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ వివరించారు.
బాధితులను ఆదుకుంటాం : పేర్ని
కృష్ణానది వరద వల్ల ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని, వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టినా అధికారులు అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశామని మంత్రి పేర్ని వెంకట్రామయ్య చెప్పారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. భవనాల పైఅంతస్థుల్లో నివసించే ప్రజలు ఇప్పటికీ ముంపు ప్రాంతంలోనే ఉన్నారని, వారిని తక్షణం పునరావాస ప్రాంతాలను తరలించాలని అధికారులను ఆదేశించారు. వైద్యాధికారులు ప్రతి ఇంటిని సందర్శించి అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని చెప్పామన్నారు. కృష్ణలంక ప్రాంతంలో డ్రైనేజీ సమస్య వల్ల కూడా ముంపు బెడద పెరిగిందని, డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు ఆయన సూచించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, మున్సిపల్, హెల్త్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.