విజయవాడ

వరద తగ్గుముఖం పట్టినా అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఆగస్టు 17: కృష్ణానదికి వరద తగ్గుముఖం పట్టినా మరో రెండు రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అనీల్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం నగరంలోని ప్రకాశం బ్యారేజీ వద్ద రాష్ట్ర మంత్రులు అనీల్‌కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని, కొడాలి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు వరద ఉద్ధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అనీల్‌కుమార్ మాట్లాడుతూ 8లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, వరద శనివారం సాయంత్రానికి 7లక్షల క్యూసెక్కులకు తగ్గుముఖం పట్టిందన్న ఆయన మరో రెండు, మూడు రోజులలో సాధారణ స్థితికి వస్తుందన్నారు. మంత్రులు, అధికారులు, వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారన్న ఆయన ఇప్పటివరకూ 15వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. ప్రభుత్వ అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తున్నారని, ఇప్పటివరకూ అందిన తాత్కాలిక అంచనా ప్రకారం కృష్ణాజిల్లాలో 6వేల హెక్టార్లలో వ్యవసాయానికి, 1600 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. నీరు తగ్గిన తరువాత సర్వే చేసి నష్టపోయిన ప్రతి రైతుకు సహాయం అందిస్తామన్నారు. అలాగే దెబ్బతిన్న ఇళ్లకు సైతం పరిహారం అందించి బాధితులను ఆదుకుంటామన్నారు. వరదల అనంతరం అంటువ్యాధులు సోకకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి అనీల్‌కుమార్ యాదవ్ ఫ్లడ్ మేనేజ్‌మెంట్ రాదనే విషయంలో ఎన్‌ఎస్‌పీ నుంచి పులిచింతల, పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ అక్కడ నుంచి కిందకి ఏవిధంగా వదిలామో నిపుణులను ఎవరైనా తప్పని చెప్పమనాలన్నారు. 1998లో ఒకసారి ఫ్లడ్ వస్తే శ్రీశైలం ఏ విధంగా పవర్ ప్రాజెక్టును ముంచి వేశారని, గత పాలకులకే ఫ్లడ్ మేనేజ్‌మెంట్ తెలియదని ఎద్దేవా చేశారు. కేవలం 23 మంది ఎమ్మెల్యేలనే ఇచ్చి ప్రజలు బుద్ధి చెప్పినా టీడీపీ తీరు మారలేదన్న విషయం స్పష్టమవుతోందన్నారు. పుష్కలంగా నీరు వస్తున్న తరుణంలో తండ్రీ కొడుకులు ఓర్వలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరంపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్తున్నామని, రీ టెండరింగ్ విధానంలో చేసే బేసిక్ ప్రైస్ తగ్గుతుందే కానీ పెరగదన్నారు. నవంబర్ 1 నుంచి పోలవరం పనులు తిరిగి ప్రారంభిస్తామన్న ఆయన నిర్ణీత సమయం ప్రకారం పూర్తిచేస్తామన్నారు. 10వేల కోట్ల నామినేషన్ పద్ధతిపై ఇవ్వడం మంచి పద్ధతి కాదని, దీనిలో ఎంతో అవినీతి జరిగిందన్నా ఉద్ఘాటించారు.
తమ ప్రభుత్వం వరద బాధితులందరినీ ఒకే విధంగా ఆదుకుంటుందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, రాత్రి పగలు కష్టపడి వరద పరిస్థితిని అధిగమించామన్నారు. ప్రతిపక్షం చేసే ఆరోపణలను పట్టించుకోకుండా బాధ్యతలు గుర్తెరెగి పనిచేస్తున్నామన్న బొత్స వరద రాజకీయాలు, బురద రాజకీయాలు చేయడం లేదన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేస్తుందని, ప్రస్తుత వరదలకు ఒక బాలిక మృతి చెందడం విషాదకరమన్న ఆయన బాలిక కుటుంబాన్ని కూడా ఆదుకుంటామన్నారు. 10ఏళ్ల తరువాత ఇంత పెద్దస్థాయిలో వరద వచ్చిందని, ఇరిగేషన్ తదితర అధికారులు అప్రమత్తంగా ఉండటం వలన నష్టాన్ని నివారించగలిగామన్నారు. మంత్రుల వెంట కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ కే మాధవీలత, తదితరులు పాల్గొన్నారు.