విజయవాడ

అభివృద్ధి, సంక్షేమ రంగాల్ని విస్మరించిన వైకాపా ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, జూలై 20: వైకాపా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాలను విస్మరించిందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. శనివారం బందరు రోడ్డు అశోక్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని మరచి ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని అసెంబ్లీలో అవహేళన చేయటం, కక్షసాధింపు చర్యలతోనే ఈ రెండు నెలల వైకాపా పాలన సాగిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైకాపా పాలన ప్రజలు అసహ్యంచుకునే రీతిలో సాగుతోందన్నారు. పరిపాలనలో జగన్‌కు అనుభవం లేని విషయం స్పష్టంగా బయటపడుతోందన్నారు. ముఖ్యమంత్రి జగన్ సహా వైకాపా ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు బదులు తమ నాయకుడు చంద్రబాబును అవహేళన చేయటం, గత మంత్రులు, ఎమ్మెల్యేలపై నిరాధార అవినీతి ఆరోపణలతో అల్లరి చేస్తూ విలువైన సభా సమయాన్ని వృథా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో నడుస్తున్న కరెంటు కోతలు, సమయానికి అందని సామాజిక పింఛన్లు, నానాటికీ తీవ్రవౌతున్న ఇసుక సమస్యపై లబ్ధిదారుల గోడు వినేవారు లేకపోవటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజాసమస్యలపై ఇకనైనా ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను సమర్థవంతంగా అందరికీ తెలియజెప్పి రానున్న ఎన్నికల్లో విజయవాడ నగరపాలక సంస్థను టీడీపీ కైవసం చేసుకునేలా కార్యకర్తలు కలసికట్టుగా పనిచేయాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వం అమలుకు నోచుకొని ఎన్నో కష్టతరమైన హామీలు ఇచ్చిందని, వాటన్నింటినీ పరిశీలించి రానున్న కాలంలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు యలమంచిలి గౌరంగబాబు, రహీం అఫ్సర్, చెన్నుపాటి గాంధీ, వీరంకి డాంగేకుమారి, తదితరులు పాల్గొన్నారు.