విజయవాడ

సమస్యల పరిష్కారానికి నూతన సాంకేతికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 15: ప్రజలకు చేరువగా నగరంలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారానికి నూతన సాంకేతికతను వినియోగిస్తున్నట్టు వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. చేతిలో సెల్‌ఫోన్ ఉంటే మీ వీధిలోని సమస్య ఏదైనా వీఎంసీ ఫిర్యాదుల వాట్సాప్‌కు పంపి స్తే చాలు, 24గంటల్లో ఆ సమస్యను ప రిష్కరించి తగు సమాచారమిస్తామని కమిషనర్ వెంకటేష్ ప్రకటించారు. నగర ప్రజలకు కల్పించిన అరుదైన ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని నగరాభివృద్ధిలో భాగస్వాములవ్వాలన్న ఆయన సోమవారం సాయం త్రం వీఎంసీ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో తాను చేపట్టబోయే విధి విధానాలను వివరించారు. 81819609 09 సెల్ నెంబర్‌కు వాట్సాప్, టెలీగ్రామ్ ద్వారా తమ సమస్యలు తెలపాలని, కే వలం మెసేజ్‌లకే పరిమితమైన ఈ నెం బర్ నేరుగా కమాండ్ కంట్రోల్‌కు అ నుసంధానంగా పనిచేస్తుందన్నారు. విషయాన్ని పోస్ట్ చేసేటప్పుడు డివిజన్, స్ట్రీట్, లొకేషన్ ల్యాండ్ మార్కు తెలిపితే త్వరగా గుర్తించి నేరుగా సం బంధిత అధికారులకు ఆ సమాచారా న్ని పంపడం జరుగుతుందన్నారు. చె త్త సేకరణ, తరలింపు, యూజీడీ, మ్యా న్ హోల్స్, మురుగు పారుదల, దోమ ల వ్యాప్తి తదితర అంశాలే కాకుండా ప్రజలకు అసౌకర్యం కలిగించే వివిధ సమస్యలను సైతం తెలుపవచ్చని తెలిపిన ఆయన త్వరలోనే చెత్త రవాణాలో జీపీఎస్ ట్రాక్ విధానాన్ని అమలుచేస్తున్నామని, ఎటువంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా జీపీఎస్ సమాచారం మేరకే ప్రైవేటు వాహనాలకు బిల్లుల చెల్లింపులుంటాయన్నారు. ప్రస్తుతం ట్రాక్టర్ల కాంట్రాక్ట్ కాలపరిమితి పూర్తయినందున వాటి స్థానంలో కొత్తగా మినీ ట్రక్‌లను ఏర్పాటుచేయబోతున్నట్టు తెలిపారు. చెత్త తరలింపులో కూడా ఆర్‌టీజీఎస్ అనుసంధానంతో ఏర్పాటై ఉన్న కెమేరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రజలు ఫోన్ ద్వారా తెలిపిన సమస్యను ఆర్టీజీఎస్ కెమేరాల సమాచారంతో క్రాస్ చెక్ చేసుకుంటామన్నారు.

అధిష్ఠాన దేవతకు ఆషాఢసారె
ఇంద్రకీలాద్రి, జూలై 15: ఇంద్రకీలాద్రి ఆధిష్ఠాన దేవత శ్రీకనకదుర్గమ్మ కు సోమవారం ఉదయం వివిధ ప్రాం తాలకు చెందిన భక్తకమిటీల సభ్యులు తరలి వచ్చి అమ్మవార్లకు ఆషాడ మాస సారెను సమర్పించి వారి వారి మొక్కుబడులను చెల్లించుకున్నారు. సారెను తీసుకొచ్చిన భక్తకమిటీ సభ్యులకు ఆలయ ఈవో వి కోటేశ్వరమ్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ మల్లిఖార్జున మహామండపంలో ఉన్న అమ్మవారి ఉత్సవ మూర్తికి వీటిని సమర్పించగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కమిటీ సభ్యులకు అమ్మవారి దివ్య అశీస్సులిచ్చి ప్రత్యేక ప్రసాదాలను అంద చేశారు. గవర్నపేట, పాత గుంటూరు, కొత్త గుంటూరు, తదితర ప్రాంతాల నుండి భక్తకమిటీ సభ్యులు అమ్మవారి సన్నిధికి వచ్చారు.