విజయవాడ

స్పందన కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: స్పందన కార్యక్రమం ద్వారా ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఈ దిశగా ప్రతి సోమవారం మండల, డివిజన్, జిల్లాస్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించాలని జిల్లా కలెక్టర్ ఎఎండీ ఇంతయాజ్ అన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జిల్లా అధికారులతో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు జవాబుదారి, పారదర్శకమైన పాలన అందించాలనే లక్ష్యాన్ని నేరవేర్చే దిశలో జిల్లా అధికారులు అందరూ ఆయా శాఖలు అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలను అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందే విధంగా కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్లను ఎంపిక చేయడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు నేరుగా ప్రతి లబ్ధిదారునికి అందించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. నవరత్నాలు పథకాల అమలుపై ప్రతి అధికారి ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. వైఎస్‌ఆర్ ఆసరా, స్పందన, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, రైతు భరోసా, వైఎస్‌ఆర్ బీమా మొదలగు ప్రభుత్వ పథకాల అమలుకు ఆయా శాఖల అధికారులు ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా పని చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో దరఖాస్తు చేసిన ప్రతి వ్యక్తికి సంబంధిత అధికారి రశీదు అందించి ఎంతకాలంలో ఆ సమస్యను పరిష్కారం చేసేది స్పష్టంగా తెలియజేయాలని కలెక్టర్ అన్నారు. ప్రతి నెల 3వ శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్ డేగా అమలు చేయాలని కలెక్టర్ అన్నారు. అక్టోబర్ 2 నాటికి అన్ని గ్రామాల్లోను గ్రామ సచివాలయాలు పని చేస్తాయని, ఆగస్టు 15 నాటికి గ్రామ వార్డు, వాలంటీర్ల ఎంపిక పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. అమ్మఒడి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని ఈ దిశగా విద్యాశాఖ అధికారులు పని చేయాలని కలెక్టర్ అన్నారు. అక్టోబర్ 15 నాటికి రైతు భరోసా కార్యక్రమం క్రింద ప్రతి రైతుకు 12,500 రూపాయలు ఇన్‌పుట్ సబ్సిడీగా ప్రభుత్వం అందజేస్తున్నదని కలెక్టర్ అన్నారు. వైఎస్‌ఆర్ బీమా పథకం, రైతులకు అమలు చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వచ్చే ప్రజలను చిరునవ్వుతో పలకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. వివిధ సంస్థలకు, వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన భూమిని కృష్ణాజిల్లాలో ఎంత మేరకు వినియోగంలో ఉన్నది అనే విషయంపై ల్యాండ్ ఆడిట్ నిర్వహించి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాధవీలత, జేసీ-2 పి బాబురావు, డీఆర్‌వో ప్రసాద్, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.