విజయవాడ

అక్రమ కట్టడం కూలిస్తే ఎందుకు గగ్గోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: అక్రమ కట్టడం ప్రజావేదికను కూల్చివేస్తామంటే టీడీపీ వంది మాగదులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మాత్యులు పేర్ని నాని ఎద్దేవా చేశారు. రెండవ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు మంగళవారం ప్రజావేదిక వద్దకు వచ్చిన మంత్రి పేర్ని నాని కరకట్ట వద్ద మీడియాతో మాట్లాడుతూ అవినీతి అక్రమాలతో ప్రజావేదికను నిర్మాణం చేయడమే కాకుండా చట్టాన్ని నిర్వీర్యం చేసి అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాన్ని తొలగిస్తామని మంచి నిర్ణయం తీసుకుంటే ఎందుకు కన్నీరు, మున్నీరు అవుతున్నారని ప్రశ్నించారు. 4 కోట్లు ఖర్చు అయ్యే ప్రజావేదిక అంచనాలను రూ. 8.9 కోట్ల రూపాయలకు పెంచుకుని దానిని హాల్వ తిన్నట్లు తీనేస్తారన్నారు. సీఆర్‌డీఏ అనుమతి లేకుండా, రివర్ కన్సర్వేషన్ బోర్డు ఎన్‌ఓసీ లేకుండా అధికారం ఉందని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజావేదికను నిర్మించారన్నారు. చట్టాన్ని అమలు చేయవలసిన వాళ్ళే వాటిని ఉల్లంఘిస్తే ప్రజానీకం క్షమించారని, ప్రజావేదికను తొలగిస్తామని కలెక్టర్ సమావేశంలో ప్రకటించడం సరైన చర్య అని మంత్రి పేర్కొన్నారు. చట్టం ముందు ముఖ్యమంత్రి అయినా, సామాన్యుడైనా ఒకటే అని, ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు చట్టాన్ని ఉల్లంఘిస్తే సామాన్య ప్రజానీకానికి ఎలాంటి సంకేతాలు వెళతాయని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు నివాసానికి కూడా ప్రభుత్వం అద్దె చెల్లించిందని అద్దె భవానాన్ని తొలగిస్తామంటే ఎదో అఘాయిత్యం జరిగినట్లు అల్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబునాయుడు నివాసం లింగమనేనిదా? చంద్రబాబునాయుడుదా? రాజధానిలో పొందిన ప్రతిఫలంతో గిఫ్ట్‌గా ఏమైనా ఇచ్చారా అనే అనుమానం కలుగుతుందన్నారు. చంద్రబాబునాయుడు సొంతమైతే టీడీపీ నాయకులు బాధపడాలి తప్ప అద్దె భవనంపై అంత ప్రేమ ఎందుకు అని అన్నారు. ప్రతిపక్ష నాయకునికి ప్రభుత్వ భవనం అవసరం అయితే ప్రభుత్వం పరిశీలించి కేటాయిస్తుందన్నారు. నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రజావేదికను 8.9 కోట్లు చెల్లించారని ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనన్నారు. భవనాన్ని తొలగించిన తరువాత కేవలం కోటిన్నర మాత్రమే వృధా అవుతుందని, రెండున్నర కోట్ల విలువైన తొలగించిన సామాగ్రిని మరలా తిరిగి వేరేచోట వినియోగిస్తామన్నారు. అధికారమద, అవినీతి, దుర్మార్గపు పాలన చేసిన యనమల రామకృష్ణుడుకు జగన్‌ను విమర్శించడానికి వీనమీత్తు అర్హత కూడా లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్ తన పాలన చర్యలతో ఆకాశం అంత ఎత్తుకు ఎదిగారని మంత్రి పేర్ని నాని అన్నారు.

కృష్ణాకు 8,500 వాలంటీర్ల నియమానికి నోటిఫికేషన్ జారీ
* కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్

విజయవాడ, జూన్ 25: జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో 8,500 మంది వార్డు వాలంటీర్ల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేశామని, నిరుద్యోగ యువత జూలై 5వ తేదీల్లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్ అన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం వార్డు వాలంటీర్ల ఎంపిక ప్రక్రియపై మెష్మా పీడీతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో విజయవాడ నగర పాలక సంస్థ, ఐదు పురపాలక సంఘాలు, మూడు నగర పంచాయతీల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒక వార్డు వాలంటీర్లను ఎంపిక చేయనున్నామని కలెక్టర్ అన్నారు. అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ రోజు నుండి జూలై 5వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించనవసరం లేదని కలెక్టర్ అన్నారు. డిగ్రీ పాసైన వారు, 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు వారు వార్డు వాలంటీర్లుగా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని అన్నారు. అర్హత కలిగిన వారు ఆధార్ నెంబర్, విద్యార్హత ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ నందు జూలై 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్ తెలిపారు.