విజయవాడ

ప్రతి గిరిజనుడికి ప్రభుత్వ ఫలాలు అందేలా స్పష్టమైన కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు విభిన్న పథకాల అమలు కోసం విస్పష్టమైన డేటాను సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమం విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రణాళికను అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నారని, తదనుగుణంగా ప్రతి ఒక్క గిరిజనుడికి ప్రభుత్వ ఫలాలు అందేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. విజయవాడ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శాఖ సంచాలకులు గంధం చంద్రుడుతో కలిసి విభిన్న అంశాలపై సమీక్ష చేసిన మీనా ఆయా స్థాయిల అధికారులకు తదనుగుణ ఆదేశాలు జారీ చేశారు. కార్యదర్శులు, కలెక్టర్ల సదస్సుకు సంబంధించి సోమవారం ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన సమావేశం మేరకు మీనా అధికారులకు దిశానిర్దేశం చేశారు. గిరిజనులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో సూపర్ స్పెషారిటీ వైద్య సంస్థలు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన కాగా, తగిన ప్రాంతాన్ని అనే్వషించాలన్నారు. గూడు లేని గిరిజనుడు ఉండరాదని సీఎం స్పష్టపరిచారని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు వేగంగా చేయాలని ఆయన పేర్కొన్నారు. గిరిజన జిల్లా ఏర్పాటుకు సంబంధించి వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక సిద్ధం చేయాలన్నారు. ప్రతి గిరిజన తండాను పంచాయతీగా మార్చే విషయంలో పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని మందుకు సాగాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు గంధం చంద్రుడు మాట్లాడుతూ మేనిఫెస్టో మేరకు ప్రతి విషయం పైనా స్పష్టమైన నివేదిక సిద్ధం చేయాలన్నారు. గిరిజనులకు సంబంధించిన ప్రభుత్వ పథకాలన్నీ టైకార్ నేతృత్వంలో జరుగుతున్నందున వారి జనాభాకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సంస్థ ఎండీ రవీంద్రబాబుకు సూచించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ శేషుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్ జన్మదినోత్సవాన్ని రాష్ట్ర రైతు దినోత్సవంగా ప్రకటించడం అభినందనీయం
* వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి

విజయవాడ, జూన్ 25: రైతు బాంధవుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినమైన జూలై 8వ తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు దినోత్సవంగా ప్రకటించడం అభినందనీయమని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న జగన్‌ని ఆంధ్రప్రదేశ్ రైతాంగం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. ఓ రైతుగా తాను ఈ విషయంలో గర్వపడుతున్నానని అన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మాజీ ఉప ప్రధానిగా, దేశ ప్రధానిగా చౌదరీ చరణ్‌సింగ్ జయంతిని డిసెంబర్ 23వ తేదీన జాతీయ రైతు దినోత్సవంగా ఇప్పటికే జరుపుకుంటున్నారని అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించడంతోపాటు ఆ రోజున ఏపీ రైతులకు పండుగలా చేస్తామని జగన్ ప్రకటించడం ఆనందించదగ్గ విషయమన్నారు. ఈ నిర్ణయంతోపాటు వైఎస్ అడుగుజాడలలో నడుస్తూ నవరత్నాలలో రైతులకు అనుకూలమైన నిర్ణయాలతో రైతు నాయకుడిగా నిరూపించుకున్నారన్నారు.