విజయవాడ

అమ్మఒడి ప్రభుత్వ పాఠశాలలకే వర్తింపు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకే వర్తింపచేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్‌పేటలోని దాసరి నాగభూషణరావు భవన్‌లో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ సుబ్బారావు అధ్యక్షతన ‘అమ్మఒడి పథకం ప్రభుత్వ పాఠశాలలకు వరమా... శామపా’ అనే అంశంపై మంగళవారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జీ రంగన్న, కే రమేష్‌లు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం తీసుకొస్తున్న అమ్మఒడి పథకాన్ని తెల్లరేషన్ కార్డులు ఉన్న అందరికీ వర్తింపజేస్తామని చెప్పడం వలన రాష్ట్ర ప్రజలు అయోమయంలో పడిపోయారని దీని వలన ప్రతి సంవత్సరం రూ. 10వేల కోట్లు బడ్జెట్ ప్రభుత్వంపై భారం పడనుందని వెంటనే ప్రభుత్వ విద్య నిర్వీర్యం కాకుండా అమ్మఒడిని ప్రభుత్వ పాఠశాలలకే వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌టీయు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ జోసఫ్ సుధీర్‌బాబు, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ హృదయరాజు, ఎస్‌ఏఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ శౌరిరాయలు మాట్లాడుతూ అమ్మఒడి పథకం తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామని కానీ ప్రైవేట్, కార్పొరేట్‌కి వర్తింపజేస్తే ప్రభుత్వ విద్యకు పాతరేసినట్లేనని టీటీసీ, బీఈడీ చదివిన విద్యార్థుల జీవితాలు అంధకారంలోకి నెట్టబడతాయని వెంటనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించి విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, మేధావులతో చర్చించి పునరాలోచించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ రౌండ్‌టేబుల్‌లో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ అప్సర్, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కే శివారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహా, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు కే మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అవివేకం మాని విజ్ఞతతో వ్యవహరించండి
*మేయర్ కోనేరు శ్రీ్ధర్
విజయవాడ (కార్పొరేషన్), జూన్ 25: అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ ప్రజలను మభ్యపెడుతున్న తీరు హేయమని మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన మాజీ సీఎం చంద్రబాబు నివాసం సమీపంలో ఉన్న ప్రజా వేదిక అక్రమ నిర్మాణం అంటూ దానిని కూల్చడానికే పూనుకున్న వైనం అవివేకమని, ఇప్పటికైనా విజ్ఞతతో వ్యవహరించి ప్రజావేదికను కొనసాగించాలన్నారు. ఇటువంటి చర్యలతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతుండటమే కాకుండా ప్రతీకార చర్యలకు అద్దం పడుతున్నాయన్నారు. ప్రజా వేదికతోపాటు కృష్ణానదీ తీరంలో అనేక నిర్మాణాలుండగా, కేవలం ప్రజా వేదికపైనే దృష్టిసారించి, దానిలోనే కలెక్టర్ల మీటింగ్ ఏర్పాటు చేసి అక్రమ కట్టడంలో మనం సమావేశమైనామంటూ సీఎం జగన్ ప్రసంగించడం విడ్డూరమన్నారు.