విజయవాడ

‘తూర్పు’గద్దె మళ్లీ రామ్మోహన్‌దే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, మే 23: ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రెండోసారి గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. తూర్పు ప్రజలు మళ్లీ గద్దెకు పట్టం కట్టారు. మొత్తం 2,75,653 ఓట్లు ఉండగా అందులో మొత్తం 1,85,671 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌కు 82,556 ఓట్లు రాగా, వైకాపా అభ్యర్థి బొప్పన భవకుమార్‌కు 67,156 ఓట్లు లభించాయి. ఇక జనసేన అభ్యర్థి బత్తిన రాముకు 30వేల 9ఓట్లు వచ్చాయి. గద్దె రామ్మోహన్ 15,400 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే తూర్పు నియోజకవర్గంలో టీడీపీ, వైకాపా, జనసేన కాంగ్రెస్, బీజేపీ, ప్రజాశాంతి పార్టీ, పిరమిడ్, ముందడుగు ప్రజాపార్టీ, నవరంగ్ కాంగ్రెస్ తూర్పు నియోజకవర్గం నుండి ఎన్నిక బరిలో దిగాయ. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైకాపా అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ కొనసాగింది. తూర్పులో మొత్తం 23 రౌండ్లు ఉండగా 2,3,11,12 నాలుగు రౌండ్లలో వైకాపా అభ్యర్థి బొప్పన భవకుమార్ స్వల్ప అధిక్యత ప్రదర్శించగా, మిగిలిన 19 రౌండ్‌లలో మొదటి నుండి గద్దె ఆధిక్యతను ప్రదర్శించారు. దీంతో వరుసగా రెండోసారి కూడా తూర్పు నియోజకవర్గం ప్రజలు గద్దెకు పట్టం కట్టారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడ నుండి 15,503 ఓట్లతో గద్దె టీడీపీ తరపున విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో మాత్రం 15,400 ఓట్లతో విజయాన్ని నమోదు చేసుకున్నారు. అంటే ఈ ఎన్నికలో పోస్టల్ ఓట్లు తగ్గటంతో గద్దెకు సుమారు 103 ఓట్లు తగ్గిన విజయ దుందుభి మోగించారు. గద్దె రామ్మోహన్ ఎంఎస్సీ ఉన్నత విద్యను అభ్యసించగా, ఆయన సతీమణి గద్దె అనూరాధ ప్రస్తుతం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా పదవిలో కొనసాగుతున్నారు. గద్దె దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గద్దె రామ్మోహన్ తొలిసారిగా 1994లో గన్నవరం నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి టీడీపీలో చేరారు. తరువాత 2004లో కంకిపాడు నియోజకవర్గం నుండి, 2009లో తూర్పు నియోజకవర్గం నుండి ఆయన ఓటమి పాలయ్యారు. 1999లో విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ విజయం సాధించి లోకసభలో అడుగుపెట్టారు. అయితే ఈసారి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గద్దెకు మంత్రి పదవి ఖాయమని కార్యకర్తలు అనుకుంటున్న తరుణంలో వైకాపా అధ్యక్షుడు జగన్ సారథ్యంలో ఆ పార్టీ రాష్ట్రంలో విజయదుందుభి మోగించటంతో గద్దె రామ్మోహన్‌కు మంత్రి పదవి మిస్ కావటం టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రం మొత్తం మీద వైకాపా 153 స్థానాలలో ప్రభంజనం సృష్టించినా తూర్పులో మాత్రం గద్దె రామ్మోహన్ విజయం సాధించటం వెనుక ఆయన నిత్యం ప్రజల మధ్య ఉండి సమస్యలు పరిష్కరించటమేకాక, గద్దె చేసిన అభివృద్ధి, సంక్షేమం గెలుపునకు దోహదం చేశాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్రం మొత్తం జగన్‌కు జయహో కొట్టగా, ఇక బొప్పన భవకుమార్ ఓటమికి ఒక రకంగా జనసేన పార్టీ అభ్యర్థి బత్తిన రాముతోపాటు, స్వయంకృత అపరాధమని కూడా తూర్పులో వైకాపా శ్రేణులు చర్చించుకోవటం విశేషం. ప్రస్తుతం బొప్పన భవకుమార్ వైకాపా నగరంలో 3వ డివిజన్ వైకాపా కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు. ఏది ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో వైకాపా పార్టీ ప్రభంజనం సృష్టించిన గద్దె రామ్మోహన్ రెండోసారి విజయం సాధించటం చర్చినీయంశంగా మారింది.