విజయవాడ

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 18: సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుండి ప్రారంభమైందని విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ డా. కృతికా శుక్లా అన్నారు. నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం రిటర్నింగ్ అధికారి హోదాలో అభ్యర్థులు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. బందోబస్తుకు చేపట్టవలసిన ఏర్పాట్లుపై పోలీసు అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనందున అభ్యర్థులు ఈనెల 25లోగా నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుందని, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థులు 48 గంటలు ముందుగా ర్యాలీకి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయ గేటు వరకు 100 మీటర్ల పరిధిలో అభ్యర్థికి సంబంధించి మూడు వాహనాలను మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. గేటు వద్ద నుండి అభ్యర్థితోపాటు నలుగురు నామినేషన్లు చేసేందుకు అనుమతిస్తామన్నారు. ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా వాహనాలు, ర్యాలీలను, బృందాలుగా వ్యక్తులను రిటర్నింగ్ కార్యాలయం పరిధిలో అనుమతించవద్దని పోలీసు అధికారులను రిటర్నింగ్ అధికారి కోరారు.
పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, ఈ ఎన్నికలకు పార్లమెంట్ పరిధిలో 1804 పోలింగ్ స్టేషన్లు వీటిలో 914 అర్బన్‌లో ఉండగా, 890 పోలింగ్ స్టేషన్లు రూరల్ పరిధిలో ఉన్నాయన్నారు. 1972 మంది ప్రిసైండింగ్ అధికారులు, 9269 మంది పోలింగ్ అధికారులు, 137 మంది సెక్టార్ అధికారులు, 182 మంది రూట్ ఆఫీసర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు జనరల్ అబ్జర్వర్, ఎక్స్‌పెండించర్ అబ్జర్వర్ నగరానికి చేరుకున్నారన్నారు. ఎన్నికల నిర్వహణపై 25వేల మంది ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైండింగ్ అధికారులకు మొదటిదశ శిక్షణ ప్రారంభమైందన్నారు. సమావేశంలో సహాయ రిటర్నింగ్ అధికారి కేడీవీఎం ప్రసాదబాబు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు జీవీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.