విజయవాడ

రైడర్ బస్సులు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), మార్చి 18: పెరుగుతున్న పోటీ నుండి తట్టుకుంటూ, మరోవైపు నష్టాలను అధికమిస్తూ అభివృద్ది పథంలోనికి వెళ్తున్న ఆర్టీసీ తన అమ్మలపోదిలోనికి నూతన రైడర్ బస్సులను సమకూర్చుకుంది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశిష్ట సదుపాయాలు కలిగిన నైడ్ రైడర్ బస్సులను సమకూర్చుకుంది. ఆర్టీసీ నూతంనంగా కొనుగోలు చేసిన 12 బస్సులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సర్వీసులను అందించనుంది. మరో రెండు రోజుల్లో రూట్లు, టిక్కెట్ ధరలను ఆర్టీసీ ప్రకటించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. విజయవాడ - విశాఖ మార్గంలో 6, విశాఖ - హైదరాబాద్ మార్గంలో 2, అమలాపురం - హైదరాబాదు మార్గంలో మరో రెండు బస్సులను నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైయ్యింది. ఈ బస్సులలో డ్రైవరు సీటుపై ప్రత్యేక శ్రద్ధపెట్టి న్యూమాటిక్ సీటును ఏర్పాటు చేశారు. ఈసీటు డ్రైవరు ఎత్తుకు అనుగుణంగా, డ్రైవరు సీటు ఎత్తు పెంచుకోవడం, తగ్గించుకోవడం వంటివి చేయవచ్చు. ఈ సౌకర్యం వలన డ్రైవరు త్వరగా అలసటకు గురి కాకుండా , సౌకర్యవంతగా డ్రైవింగ్ చేసే వీలు ఉంటుందని ఆర్టీసీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ కృష్ణమోహన్, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఆదం సాహెబ్ తెలిపారు.