విజయవాడ

ముగిసిన ఓటరు దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 15: సార్వత్రిక ఎన్నికలకు ఓటరు నమోదు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. నగరంలోని వీఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు డివిజన్ల వారీగా అధికారులతోపాటు వివిధ రాజకీయ పక్షాల నేతలు కూడా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేసి ఓటు దరఖాస్తులను అం దించారు. అంతేకాకుండా ఆన్‌లైన్ లో కూడా నమోదు సౌకర్యం ఉండటంతో వేలాది మంది తమ ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఓటు దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తరుణంలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, వాటిలో అర్హత కలిగిన వా రందరికీ ఓటు హక్కును కల్పించేందు కు అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృత చర్యలు తీసుకుంటున్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి వారి డివిజన్లు, బూత్‌ల వారీగా విభజించి సంబంధిత అధికారులకు అందించనున్నారు. ఫారం -7 తో ఓట్లను తొలగించారన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రజానీకం తమ ఓటును సరిచూసుకుని లేనిపక్షంలో మళ్లీ దరఖాస్తు చేసుకోవడంతో ఓటు కోసం వేలాది దరఖాస్తులు వచ్చాయి. వాస్తవానికి గత ఎన్నికల్లో ఓటు వేసిన వారికి కూడా ప్రస్తుత జాబితాలో ఓటు లేకుండాపోవడానికి గల కారణాలు ఏమిటన్న విషయం పక్కన పెడితే, అర్హత కలిగిన వారందరికీ ఓటు హక్కు కల్పించాలన్న లక్ష్యంతో ఎన్నికల అధికారు లు ఊపిరి సైతం పీల్చుకోలేని పరిస్థితి లో తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఒ కపక్క ఎమ్మెల్సీ ఎన్నికలు, మరోపక్క అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ప్రక్రి య అంతా రోజుల వ్యవధిలోనే ప్రా రంభం కావడంతో, ఆయా ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు, విధులు అప్పగింత, సిబ్బంది ఏర్పాటు, సౌకర్యాల కల్పన తదితర అంశాల్లో ఉన్నతాధికారులు సతమతమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఓటు నమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయ గా, తదుపరి చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

నగరంలో భారీగా ఓట్ల తొలగింపు
నమోదు జనం క్యూ * పని చేయని సర్వర్లు, వెనుదిరిగిన ఓటర్లు
పాయకాపురం, మార్చి 15: గతంలో ఎన్నడూ లేని విధంగా అనూహ్యంగా నగరంలో ఎప్పటి నుండో ఉంటున్న ఓ ట్లు కళ్లు మూసి తెరిచే సరికి కనుమరుగైపోతున్నాయ. అదేదో ఒకటి రెండు కావు ఒక్కో డివిజన్‌లో వేలల్లో! తమకెలాగూ ఓటరు కార్డు ఉంది, ఆధార్ ఉం ది, తమ ఓటు ఎవరు తొలగిస్తారనే భా వనలో సొంతింటి నిర్వాసితులు ఉండ గా, తాము ఇల్లు మారిన ప్రతిసారి ఓట రు కార్డు మార్పు చేసుకుంటున్నామనే భావనలో తమ ఓటు ఎవరు తీస్తారనే ధీమాతో అద్దింటిదార్లు ఉన్నారు. అయి తే ఆకస్మికంగా, అనూహ్యంగా రాత్రికి రాత్రే ఉన్న ఓట్లు పోవడంతో నగర వ్యాప్తంగా అనేక డివిజన్ వాసులు అ వాక్కయ్యారు. కేవలం ఓటర్లే కాదూ అ టు అధికార పార్టీకి చెందిన డివిజన్ అధ్యక్ష, యువజన నాయకులు, ఇటు ప్రతిపక్ష నేతలు సైతం ఏం జరుగుతుం దో తెలియక తలలుపట్టుకోవాల్సిన ప రిస్థితి నెలకొంది. ఈనెల 15లోపు మా త్రమే తొలగించిన ఓట్ల నమోదుకు అ వకాశం ఉండటంతో 14న కూడా ఉన్న ఓట్లు 15న తెల్లవారే సరికి కనిపించకుండాపోయాయి. దీంతో ఎవరికి వారు త మ ఫోన్ల ద్వారా ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఓటర్ ఐడి యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని తమ పాత ఓటరు కార్డు ఐడి నెంబరును ఎం టర్ చేసినప్పటికీ కొందరి ఓట్లు ఉన్న ట్లు చూపినా, అత్యధికశాతం మంది ఓ ట్లు తొలగించినట్లు చూపించడం జరిగింది. 15న ఓట్ల నమోదుకు చివరి తేదీ కావడంతో ఎవరికి వారు ఈ-సేవ కేం ద్రాలు, ఇంటర్‌నెట్ సెంటర్ల దగ్గర భారీ గా క్యూ కట్టడంతో ఒకానొక దశలో స ర్వర్లు సైతం పని చేయని స్థితి నెలకొం ది. ఆ నోటా ఈ నోటా ఓట్లు గల్లంతైన ట్లు తెలుసుకున్న స్థానికులు ఏం చే యాలో తెలియక చివరకు రాజకీయపార్టీల నేతల్ని ఆశ్రయించే ప్రయత్నం చేశారు. వారు సైతం తాము చేయగలిగింది ఏమీ లేదనీ, ఎవరికి వారు తమ ఓట్లును ఈ-సేవా కేంద్రాల ద్వారా నమోదు చేయించుకోవాలని సూచించడంతో నాయకులకు లేని బాధ తమకేమిటంటూ వెనుదిరిగి వెళ్లిపోయిన దృ శ్యాలు దాదాపు అన్ని చోట్లా కనిపించా యి. ఓట్ల తొలగింపు వెనుక అధికారపక్షం కారణమో ప్రతిపక్షం కారణమో తెలీదుగానీ ఇరు పార్టీలు ఎవరికి వారు ఎదుటి పార్టీ పై బురదజల్లే ప్రయత్నం చేయడం ఇందులో కొసమెరుపు. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గం లో అత్యధికంగా ఓట్లు గల్లంతయ్యా యని ఓటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడికక్కడ ఓట్ల నమోదుకు జనం రోడ్లపై పరుగు పెడుతున్నారు.

టెన్త్ విద్యార్థులకు ఉచిత ప్రయాణం
ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు
విజయవాడ(సిటీ), మార్చి 15: పదో తరగత పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీపి కబురు చెప్పింది. పదో తరగతి ప రీక్షలు రాసే విద్యార్థులకు ప్రతి ఏడాదిలానే ఈఏడాది కూడా ఏపీఎస్‌ఆర్టీసీ బ స్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం క ల్పిస్తూ సంస్థ వీసీ అండ్ ఎండీ ఎన్‌వీ సురేంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కేవలం హాల్ టికెట్ చూ పించి తమ నివాస ప్రాంతం నుండి ప రీక్షా కేంద్రానికి వెళ్లేందుకు మళ్లీ తిరు గు ప్రయాణానికి ఈ ఉచిత సౌకర్యం వర్తిస్తుందన్నారు. బస్సుపాసు లేకున్నా, ఇంత దూరం అనే నిబంధనతలో ని మిత్తం లేకుండా ఈ ఉచిత ప్రయాణం వర్తిస్తుందన్నారు. ఈ ప్రయాణం తెలుగువెలుగు, సిటీ సబర్బన్ బస్సులలో ఉచితం కాగా, ఎక్స్‌ప్రెస్ బస్సులలో ప్ర యాణం చేయదలచుకునే వారు తమ బస్సుపాసు మరియు పరీక్ష హాల్ టికె ట్టు చూపి, కాంబినేషన్ టికెట్ పొం దడం ద్వారా, తాము పరీక్షలు రాస్తున్న పరీక్షా కేంద్రం వరకు ఉచితంగా ప్ర యాణం చేయవచ్చు. ఈ ఉచిత బస్సు ప్రయాణం పరీక్షలు జరిగే తేదీల వ్యవ ధి వరకు మాత్రమే ఉంటుంది. మార్చి 18న మొదలు ఏప్రిల్ 3వరకు పరీక్షలు జరిగే తేదీలలో ఈ ఉచిత సౌకర్యం వర్తిస్తుంది. పరీక్ష తేదీలలో ఏదైనా సెల వు రోజులు ఉన్నప్పటికీ ఈ ఉచిత ప్ర యాణం వర్తిస్తుంది. ఈ విషయానికి అత్యధిక ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సురేంద్రబాబు ఆదేశించారు. ముఖ్యంగా కండక్టర్లు, డ్రైవర్లు ఈఉచిత ప్రయాణం నోటీస్ బోర్డు ద్వా రా తెలపాలన్నారు. గేట్ మీటింగ్‌ల ద్వారా తెలపాలన్నారు. పరీక్షలను దృ ష్టిలో ఉంచుకుని తగినన్ని బస్సులు న డపాలని ఇప్పటికే అందరు రీజినల్ మే నేజర్లుకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు సు మారు 6.21 లక్షల మంది విద్యార్థుల కు సంబంధించి ఈ ఉచిత బస్సు ప్ర యాణ సౌకర్యం వర్తించేలా ఆర్టీసీ చ ర్యలు తీసుకుంది. పరీక్షలు రాష్ట్ర వ్యా ప్తంగా 2838 సెంటర్లలో జరగనుంది.

18 నుంచి ఏప్రిల్ 11వరకు
ఆర్‌వోలు అప్రమత్తంగా వ్యవహరించాలి
సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఇంతియాజ్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 15: ఎన్నికల రిటర్నింగ్ అధికారులు (ఆర్‌వో) ఈ నెల 18నుండి ప్రారంభమయ్యే నామినేషన్ల స్వీకరణతో పాటు ఏప్రిల్ 11వ తేదీన జరిగే పోలింగ్ వరకు ఎన్నికల నియమావళిని జాగరూకతతో వ్యవహరించి పని చేయాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో స మావేశ మందిరంలో 16 అసెంబ్లీ ని యోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో నా మినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉప సం హరణ, పోలింగ్ నిర్వహణపై శిక్షణ శి బిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సం బంధించి ఆర్‌వోలు 18న ఉదయం నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యా హ్నం 3 గంటల వరకు నామినేషన్ల ప త్రాలు స్వీకరించవలసి ఉందన్నారు. ఒ క అభ్యర్థి మూడు వాహనాలకు మించి అనుమతి లేదని అభ్యర్థితో సహా ఐదుగురిని ఆర్‌వో కార్యాలయానికి అనుమతి ఉందన్నారు. ఆర్‌వో కార్యాలయం 100 మీటర్ల పరిధిలో ఇతరులు ఎవరికి అనుమతి లేదన్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో ప్రభుత్వ సెలవులు అయినందున నామినేషన్ల స్వీకరణ ఉండదన్నారు. 2014 తరువాత సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా నామినేషన్ దాఖలు చేసే వారు తమపై ఏమైనా క్రిమినల్ చార్జీషీట ఉంటే తప్పనిసరిగా తెలపవలసి ఉందన్నారు. అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్ పత్రాలను ఎన్నికల వెబ్‌సైట్‌లో పెడుతున్నందున వీటిని ప్రతి ఒక్కరు వీక్షించే అవకాశం ఉందని తదనుగుణంగా ఆర్‌వోలు అఫిడవిట్ జారీలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణపై జేసీ 2 పీ బాబూరావు, డిప్యూటీ కలెక్టర్ డీ చక్రపాణిలు ఆర్వోలకు ఎన్నికల నిర్వహణ పట్ల అవగాహన కల్పించారు. ఈ శిక్షణ శిబిరంలో జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా, సబ్ కలెక్టర్లు మీషా సింగ్, స్వప్నీల్ దినకర్‌లు పాల్గొన్నారు.

సకాలంలో ఎన్నికల నివేదికలు అందించండి
సెంట్రల్ ఆర్వో, వీఎంసీ కమిషనర్ రామారావు
విజయవాడ (కార్పొరేషన్), మార్చి 15: సాధారణ ఎన్నికలు- 2019 నిర్వహణ కోసం నియమించిన అధికారు లు, సిబ్బంది సమష్టిగాను, సమన్వయంతో పనిచేసి ఎన్నికలను పూర్తిస్థాయిలో విజయవంతంగా పూర్తి చేసేందుకు అంకిత భావంతో విధులను నిర్వహించాలని సెంట్రల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, వీఎంసీ కమిషనర్ ఎం రామారావు పేర్కొన్నారు. 80- విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎన్నిక ల నిర్వహణకై నియమించిన అధికారు లు, సపోర్టింగ్ అధికారులు, సిబ్బంది తో శుక్రవారం వీఎంసీ ఆఫీస్‌లోని తన ఛాంబర్‌లో నిర్వహించిన సమీక్షా స మావేశంలో రామారావు మాట్లాడుతూ విధుల్లో భాగంగా అధికారులు సకాలంలో నివేదికలు అందించాలని ఆదేశించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ అందరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. అదేవిధంగా బూత్ లెవల్ అధికారుల ద్వారా ఎన్నిక సంఘం వా రి నుంచి వచ్చిన ఓటరు గుర్తింపు కార్డులను ఓటర్లకు పంపిణీ చేయడంతోపాటు నూతనంగా నమోదు చేసుకున్న అర్జీలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఓటు న మోదు ప్రక్రియ పూర్తయిన తరుణం లో దరఖాస్తులను ఆన్‌లైన్ నమోదుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పలు కూడళ్లలో రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రచార బ్యానర్లు, ఫ్లెక్సీ లు, పోస్టర్లు వంటి వాటిని తొలగించుటకు చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటుచేస్తున్న అన్ని వౌలి క సదుపాయాలపై దృష్టిసారించాలన్నారు. ఈనెల 18న కేబీఎన్ కాలేజ్ లో మొదటి విడతగా ఈవీఎం మిషన్‌లపై 700 మంది పీవోలు, ఏపీవోలకు కల్పిస్తున్న శిక్షణకు అందరూ హాజరవ్వాలన్నారు. అనంతరం కమిషనర్ రామారావు అధికారులతో కలిసి వన్‌టౌన్ కే బీఎన్ కాలేజ్‌లో ఏర్పాటు చేస్తున్న ఈ వీఎంల శిక్షణ తరగతుల ఏర్పాట్లను ప రిశీలించారు. ఈ సమావేశంలో సిటీ ప్లానర్ ఏ లక్ష్మణరావు, ఎగ్జామినర్ అ శోక్ వౌర్య, ఎఆర్‌ఓ సెంట్రల్ తహశీల్దార్ శ్రీ్ధర్, సెంట్రల్ డెప్యూటీ తహశీల్దార్ వీవీడి నాగమణి, వీఎంసీ మేనేజ ర్ సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

హైకోర్టుకు ప్రత్యేక బస్సులు
* 18నుండి ప్రారంభం
* ఆర్టీసీ ఏర్పాట్లు
విజయవాడ(సిటీ), మార్చి 15: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం నేలపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రయాణికుల సౌకర్యం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడిపేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. రాజధాని పరిధిలోని పలు ప్రాంతాల నుండి ఈనెల 18నుండి హైకోర్టు ప్రాంతం నేలపాడుకు ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. గుంటూరు, మంగళగిరి(ఆటోనగర్), విజయవాడ, ఉయ్యూరు, కంకిపాడు, బెంజిసర్కిల్ వంటి ప్రాంతాల నుండి నేలపాడు హైకోర్టు ప్రదేశానికి వెళ్లెందుకు వివిధ సమయాల్లో ఆర్టీసీ సర్వీసులను నడపనున్నారు. తిరుగు ప్రయాణం కూడా ఇదే ప్రాంతాలకు వెళ్లేలా పలు సమయాల్లో సర్వీసులను నడపనున్నారు. వీటితోపాటు వివిధ ప్రాంతాల నుండి రాజధాని ప్రాంతంలోని పలు ప్రాంతాలను కలుపుతూ ఈసర్వీసులు నడవనున్నాయి. ఉదయం 8.30 నిముషాల నుండి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. చివరిగా హైకోర్టు నుండి రాత్రి 8.30 నిముషాలకు బస్సు సర్వీసు ప్రారంభం కానుంది.

మోర్త్రు జేడీగా జయరావు నియామకం
* ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల హర్షం
* ఎండీ సురేంద్రబాబును కలిసిన జయరావు
విజయవాడ(సిటీ), మార్చి 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా విశేష సేవలందించిన జీ జయరావు కేంద్రప్రభుత్వ రోడ్డు మరియు జాతీ య రహదారుల మంత్రిత్వ శాఖ(మో ర్త్రు)లో జాయింట్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. దాదాపు 33ఏళ్లపాటు ఆర్టీసీకి సేవలందించిన జయరావు ఎంపిక పట్ల ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని ఆర్టీసీ బస్‌స్డాండ్ ఆవరణలోని బస్ హౌస్ లో జయరావు శుక్రవారం ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబును శుక్రవారం మర్యాదపూర్వంగా కలిశారు. జాయింట్ డైరెక్టర్ జయరావుగా ఎంపిక కావడం పట్ల సురేంద్రబాబు ఆయనకు శుభాకాంక్ష లు తెలిపారు. సంస్థలో తాను నిర్వహించిన పోస్టులు, ఆపరేషన్ అంశాల లో సాధించిన అనుభవం ఈ పదవికి ఎంపికయ్యేందుకు దోహదపడ్డాయని జయరావు తెలిపారు. సంస్థలో నిబద దత కలిగిన పని వాతావరణంలో పలు పోస్టులు నిర్వహించిన జయరావు చివరిగా నిర్వహించిన ఆపరేషన్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ పోస్టు ఆర్టీసీకి ఎన్నో సేవలందించారని సురేంద్రబాబు తెలిపా రు. పదవీవిరమణ తరువాత కేంద్ర ప్ర భుత్వం ఆయనకు జాయింట్ డైరెక్టర్ పోస్టుకు ఎంపిక చేయడం పట్ల సంస్థ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

బాలల్లో ప్రతిభకు పదును
నగరంలో అమరావతి బాలోత్సవం సెంటర్ల ఏర్పాటు

విజయవాడ, మార్చి 15: బాలలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారిలోని ప్రతిభను మెరుగుపర్చటం, సృజనాత్మకతను వెలికితీసి శిక్షణ ఇవ్వటం కోసం అమరావతి బాలోత్సవం సెంటర్లు (ఏబీసీ) ఏర్పాటు చేయనున్నట్లు మాకినేని బసవపున్నయ్య భవన్‌లోని అమరావతి బాలోత్సవం కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేఖర్ల సమావేశం లో ఏబీసీ కన్వీనర్ జీ జోత్స్న అన్నారు. ఈ నెల 17న ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఎంబీ విజ్ఞాన భవన్‌లోని చుక్కపల్ల ఆడిటోరియంలో వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు, 4వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎ పార్థసారథి, మహిళా ప్రొటెక్షన్ సెల్ ఎస్‌పీ కేజీవీ సరిత ము ఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. అమరావతి బాలోత్సవం పిల్లల పండు గ సావనీరు ఆవిష్కర్త చొక్కాపు, వెంకటరమణ ఏబీసీలను ప్రారంభిస్తారన్నా రు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బొడ్డు నాగేశ్వరరావు, కేబీఎన్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ వంగల నారాయణరావు, పాపులర్ షూ మార్ట్ ఇండి యా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ చుక్కపల్లి అమర్‌కుమార్‌లు విశిష్ట అతిథులుగా పాల్గొంటారని వివరించారు. అమరావతి బాలోత్సవం సెంటర్స్‌లో మున్సిపల్ స్కూల్స్, వీధి బడి పిల్లలను సమీకరించి ప్రతి రోజు సాయంత్రం 6 నుం చి 8.30 గంటల వరకు కోచింగ్ ఇవ్వ టం జరుగుతుందన్నారు. బేసిక్ నాలెడ్జి ఉండేలా తీర్చిదిద్దటం కోసం కృషి చేస్తామన్నారు. ఇప్పటికే 25 సెంటర్‌లు నడుస్తున్నాయని వాటిలో 600 మంది బాలలు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. మరో 25 సెంటర్‌లను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. అమరావతి బాలోత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్ కొండలరావు మాట్లాడుతూ విద్యార్థులు మార్కుల ప్రాతిపదికన కాకుండా వ్యిక్తిత్వ వికాసంతో ఎదగాలనే ధ్యేయంతో బాలోత్సవ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బాలోత్సవం కన్వీనర్ పీ మురళీకృష్ణ మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికుల పిల్లలు బాగా వెనుకబడి ఉన్నారని వారి