విజయవాడ

జీ ప్లస్ త్రీ గృహాల నిర్మాణం సత్వరం పూర్తిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 18: జీ ప్లస్ త్రీ పక్కాగృహాల నిర్మాణ పనులను సత్వరం పూర్తిచేయాలని వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం న్యూ రాజరాజేశ్వరీపేట, కబేళా ప్రాంతాల్లో పక్కాగృహాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేసేందుకు అనువుగా నిర్మాణాలు పూర్తి చేసి వౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ గృహ సముదాయాల్లో వార్డు సచివాలయాల ఏర్పాటుకు ఎంపిక చేసిన బ్లాక్ పనులను రానున్న రెండు రోజుల్లో పూర్తి చేయనున్నట్టు అధికారులు తెలిపారు. నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పనులు పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈసందర్భంగా స్థానిక మహిళలు తాము ఎదుర్కొంటున్న నీటి సమస్యలను కమిషనర్‌కు వివరించారు. సత్వరం ఆయా సమస్యలు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. తరువాత బందర్ రోడ్డులోని స్వరాజ్య మైదాన్‌ను పరిశీలించిన కమిషనర్ ప్రజలకు అందుబాటులో ఉండేలా గ్రౌండ్ చుట్టూ వాకింగ్ ప్లాట్‌ఫారం, గ్రీనరీ ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు.

డివిజన్ల విభజనపై
20లోగా అభ్యంతరాలు తెలపాలి
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 18: నగరంలో మున్సిపల్ డివిజన్ల పునర్విభజన చేపట్టిన అధికారులు ప్రస్తుతం జరిపిన విభజన ప్రక్రియపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపాలని వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో సూచించారు. ఈ నెల 13న నగరంలోని 59 డివిజన్లను 64గా విభజించిన విషయంపై ప్రజలు అవగాహన చేసుకోవాలని కోరారు. డివిజన్ల విభజనపై సందేహాలు, అభ్యంతరాలుంటే ఈ నెల 20లోగా తెలియజేయాలన్నారు. సలహాలను కూడా అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఈ బాలజీ ఫోన్ నెంబర్ 7032906673కు కానీ, వీఎంసీ ప్రధాన కార్యాలయంలో కానీ తెలియజేయాలని ఆయన వివరించారు.